–జగన్నాథ రథయాత్రలో తొక్కిస లాట, ఒకరి మృతి
–డీహైడ్రేషన్, శ్వాస సమస్యలతో
300 మంది వరకు ఆసుపత్రికి
–లక్షలాది మంది భక్త జనంతో పూరి కిటకిట
–వేడుకలకు హాజరైన రాష్ట్రపతి ముర్ము
Jagannath Rath Yatra:ప్రజా దీవెన, భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని సముద్రతీర క్షేత్రం పూరీలో ఆదివారం నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో (Jagannath Rath Yatra) అపశ్రుతి చోటు చేసుకుంది. రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక భక్తుడు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బలభద్రుడి తాళధ్వజ రథాన్ని లాగడానికి భక్తులు ఒక్కసా రిగా ఎగబడటం ఈ దుర్ఘటనకు దారితీసింది. తొక్కిసలాటలో కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిన గుర్తు తెలియని 60ఏళ్ల వృద్ధుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెంది నట్లు వైద్యులు నిర్ధారించారు.
తొక్కి సలాటలో గాయపడిన మరో ఐదు గురిని కూడా ఆస్పత్రికి (hospital)తరలించగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు విపరీతమైన ఎం డ, ఉక్కపోతతో యాత్రకు హాజ రైన 300మందికి పైగా భక్తులు డీహైడ్రేషన్, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరారు. వీరిలో 50 మందిని ప్రాథమిక చికి త్స అనంతరం డిశ్చార్జి చేశారు. ఒడిశా ఆరోగ్యశాఖ (Odisha Health Department)కార్యదర్శి అస్పత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉండగా పూరీ జగన్నాథుడి రథయాత్ర ఆదివారం కోలాహలంగా ప్రారం భమైంది. 1971 తర్వాత తొలి సారిగా ఈ ఏడాది రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నా రు. ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షిం చడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తర లివచ్చారు. ఆలయం నుంచి దేవ తామూర్తులను రథాల వద్దకు తీసు కొచ్చే పహండి కార్యక్రమం మధ్యా హ్నం 2.15 గంటలకు ముగిసింది.
గర్భాలయం నుంచి మూలవిరాట్టు బయలుదేరే ముందు మంగళహరతి, మైలం, నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం (Mangalaharati, Mailam, Navayavana Darshan, Netrotsavam) తదితర ఆచారాలు నిర్వహించారు. తొలుత బలభద్రు డిని తాళధ్వజ రథంపైకి, సుభద్రను దర్పదలన్ రథంపైకి చేర్చారు. భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథుడు తన నందిఘోష్ రథం వద్దకు చేరుకున్నారు. పహండీ అనంతరం రథాలను అధిష్ఠించిన దేవతామూర్తులకు పూరీ శంకరా చార్య నిశ్చలానంద సరస్వతి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 4గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై చెరాపహరా (చీపురుతో రథాలను శుభ్రం చేసే ప్రక్రియ) చేశారు. రథాలకు చెక్క గుర్రాలను అమర్చిన తర్వాత రథయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 4.50 గంటలకు బలభద్రుడి రథం తాళధ్వజం ముందుగా బయలు దేరింది.
ఆ తర్వాత 6 గంటలకు దర్పదలన రథంలో సుభద్ర దేవి కదిలారు. 6.45 గంటలకు నంది ఘోష్ రథంలో (Nandi Ghosh Chariot) జగన్నాథుడి యాత్ర కదిలింది. ఈ ఊరేగింపు జగన్నా థుడి ఆలయం వద్ద ప్రారంభమై అక్కడకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయం వద్దకు చేరుకొంటుంది. ఆదివారం రాత్రి రథయాత్ర ముగిసే సమయానికి బలభద్రుడు, దేవి సుభద్ర రథాలు గ్రాండ్ రోడ్డులోకి ప్రవేశించాయి. మారికోట్ చాక్ వద్ద, రాజ్ ప్యాలెస్ సమీపంలో ఈ రెండింటినీ వరుసగా నిలిపివేశారు. జగన్నాథుడి రథం ఆలయ సింహద్వారం నుంచి బయలుదేరి కొన్ని అడుగులు ప్రయాణించిన తర్వాత ఆగిపో యింది. సోమవారం ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. కాగా, రథయాత్రలో దాదాపు 15 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు ఆ మేరకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రాష్ట్రపతి ముర్ము రథయా త్రను వీక్షించారు. మూడు రథాలకు ప్రదక్షిణలు చేసి బలభద్రుడి తాళ ధ్వజాన్ని, సుభద్ర దర్పదలన రథా న్ని ముర్ము ప్రారంభించారు. పూరీ రథయాత్రలో దేశ రాష్ట్రపతి పాల్గొ నడం ఇదే మొదటిసారి. కాగా పశ్చి మ బెంగాల్ సీఎం మమత ఆదివా రం ఇస్కాన్ (ISKCON)ఆధ్వర్యంలో కోల్‌కతా లో నిర్వహించిన జగన్నాథుడి రథయాత్రలో పాల్గొన్నారు