Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jammu and Kashmir : ఆక్రమితకశ్మీర్ లో మళ్లీ అలజడి, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమా స్ ఆనవాళ్ళు

Jammu and Kashmir : ప్రజా దీవెన, జమ్మూ కాశ్మీర్: పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమా స్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అడు గుపెడుతోందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో భార త ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. కశ్మీర్ సం ఘీభావ దినోత్సవంలో భాగంగా ఈరోజు పీవోకేలో ‘అల్ అక్సా ఫ్ల డ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన ఓ కా ర్యక్రమంలో హమాస్ కు చెందిన సీనియర్ నేత ప్రసంగించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. రావల్కోట్ లోని సబీర్ స్టేడియంలో జరగను న్న ఈ కార్యక్రమంలో జైషే మొహ మ్మద్, లష్కరే తోయిబా సంస్థల సీనియర్ నేతలు కూడా పాల్గొనబో తున్నారు.ఈ కార్యక్రమంలో హ మాస్ ప్రతినిధి ఖలీద్ కద్దౌమి ప్రసంగిస్తారని కరపత్రాలు, ఇతర మార్గాల ద్వారా ప్రచారం చేస్తు న్నా రు.

 

కశ్మీర్ లో పోరాటాన్ని పాలస్తీ నాతో ముడిపెట్టి ఆయన మాట్లాడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న జమ్మూకశ్మీర్ పై హైలెవెల్ మీటింగ్ ను నిర్వహించా రు. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కశ్మీర్ లో వాహన తనిఖీలను తీవ్ర తరం చేయాలని ఆదేశించారు. 2024 ఆగస్టులో ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలతో లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ భేటీ అయ్యాడు. 2018లోనే ఆయ నను ఉగ్రవాదుల జాబితాలో అమె రికా చేర్చింది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు ఖలీద్ సన్నిహితుడు కావడం విశేషం.