భారతీయ జనతా పార్టీలోకి జయసుధ
ప్రజా దీవెన /న్యూఢిల్లీ: ప్రముఖ సినీనటి జయసుధ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాషాయపు జెండా ఎగురవేశారు. దేశ రాజధాని ఢిల్లీ లో జయసుధ బీజేపీ లో చేరారు. గతంలో వైసీపీ లో కొనసాగిన జయసుధ కొంతకాలం అనారోగ్యం కారణాల వలన రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.
తాజాగా తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చురుకుగా ఉండాలన్న ఆలోచనతో పార్టీ మారాలని నిర్ణయించుకున్న జయసుధ పక్కా ప్రణాళికతో బీజేపీలోకి చేరారని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో తరుణ్ చూజ్, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ల సమక్షoలో జయసుధ బీజేపీ కండువా కప్పుకున్నారు.
పార్టీలో చేరిన అనంతరం జయసుధ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పధంలో దూకుసుకువెళుతోంది, అందుకే ఆ అభివృద్ధిలో తాను భాగం కావాలని బీజేపీలోకి చేరినట్లు తెలిపింది.
గత సంవత్సరం నుండి నేను పార్టీ మారాలని అందులోనూ బీజేపీ లాంటి మంచి విలువలు ఉన్న పార్టీలోకి రావాలని చర్చలు జరుగుతున్నాయి, ఇంతకాలానికి కుదిరిందంటూ వెల్లడించారు. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశ్యంతోనే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు.