–19 ఏళ్ల నాటి ట్రిపుల్ మర్డర్ కేసు చేధన
–బహుశా దేశంలో ఇదే తొలిసారి కావొచ్చు
— ఈ కేసు కథాకమీషు ఏమిటో, ల ఛేదించారు చూద్దాం
Kerala Police : ప్రజా దీవెన, కేరళ: 19 ఏళ్ల క్రితం 2006లో రంజిని, ఆమె నవజాత కవలలు ఇంట్లో శవమై కనిపిం చారు. రంజిని కత్తిపోట్లకు గురైంది. ఆమె కవల పిల్లల గొంతులు కోశా రు. అయితే రంజిని అవివాహిత, కుటుంబ సభ్యులకు దూరంగా ఉం టున్నారు. కేరళలోని కొల్లంలో పొరుగు ఇంటిలోనే ఉంటున్న అని ల్ కుమార్ తో రంజినికి రిలేషన్ షిప్ ఏర్పడింది. రంజిని గర్భవతి కావడంతో ఆమెను అబార్షన్ చేయించుకోమని అనిల్ సూ చించాడు. అయితే ఇందుకు రం జిని అంగీకరించలేదు. తన గర్భం లో పెరుగుతున్న శిశువుకు చట్టబ ద్ధత కల్పించాలని ఒత్తిడి చేసింది. దీంతో రంజిని అనిల్ కుమార్ వది లేశాడు. పఠాన్ కోట్ పోస్ట్ లో ఆర్మీ ఉద్యోగిగా అనిల్ కుమార్ పనిచేసే వారు. పఠాన్‌కోట్‌లో పనిచేస్తున్న అనిల్ కుమార్ కు కేరళకు చెందిన రాజేష్ అనే మరో ఆర్మీ సైనికుడు పరిచయమయ్యాడు. రంజిని అం శాన్ని అతనితో పంచుకున్నాడు. ఇద్దరూ కలిసి రంజిని, ఆమె నవజాత శిశువులను చంపాలని పథకం వేశారు.
పథకం ప్రకారం రాజేష్ అనిల్ కుమార్ అయ్యాడు. రంజిని డెలివరీ కోసం ఆసుపత్రిలో ఉండగా ఆమె కుటుంబంతో సన్ని హిత్యం పెంచుకున్నాడు. అనిల్‌ను కనిపెట్టి రంజినికి న్యాయం చేస్తా నని అనిల్ కుమార్ గా మారిన రాజేష్ ఆమెకు హామీ ఇచ్చారు. పెళ్లికాని తల్లి కావడంతో రంజిని మరో ఇల్లు తీసుకునేలా చేశాడు. ఫిబ్రవరి 10న రంజిని, ఆమె పిల్ల లను రాజేష్ (అనిల్ కుమార్) హత మార్చాడు. అప్పట్లో ఈ కేసు కేర ళను కుదిపేసింది. 2010లో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అ యితే సీబీఐ కూడా దీన్ని ఛేదిం చలేకపోయింది. అయితే కేరళ పోలీసులు మాత్రం పట్టు వదల లేదు. కేసు దర్యాప్తును కొనసాగిం చారు. ఏఐ టెక్నాలజీతో అనిల్ కుమార్, రాజేష్ ప్రస్తుత ముఖాల ను పునఃనిర్మించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వీరి ముఖా లను పోస్ట్ చేసి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఫేస్బుక్ ఖాతా లోని ఓ పాత వెడ్డింగ్ ఫోటోతో అని ల్ కుమార్ ఏఐ ఫోటో 90 శాతం మ్యాచ్ అయ్యింది. వెంటనే రంగం లోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని పుదుచ్చేరిలో గుర్తించారు.
సీబీఐ సహాయంతో కేరళ పోలీసులు అ తడిని పట్టుకున్నారు. ఆ వ్యక్తే అనిల్ కుమార్ గా నిర్థారించుకు న్నారు. ప్రస్తుతం విష్ణుగా పేరు మార్చుకున్నాడు. ఓ స్కూల్ టీచర్ ను వివాహం చేసుకున్నాడు. అనిల్ కుమార్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి ద్వారా ప్రవీణ్ కుమార్ గా చెలామణి అవుతున్న రాజేష్ ఆచూకీ కనుగొన్నారు. ప్రస్తుతం వీరిద్దరి వయసు 42, 48 సంవత్సరాలు. ఇద్దరూ స్కూల్ టీచర్లను వివాహం చేసుకుని నకిలీ గుర్తింపు కార్డుతో జీవనం సాగిస్తున్నారు. అలాగే.. గతంలో ఆర్మీ ఉద్యోగం చేసిన అనిల్ కుమార్, రాజేష్.. సైన్యం నుంచి పారిపోయారు. రంజిని కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మంచిది కాదని అనిల్ కుమార్, అతడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. దీంతో డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని అనిల్ కు రంజిని సవాల్ విసరడం వల్లే రంజిని, నవజాత శిశువుల హత్యకు దారి తీసింది. ఏట్టకేలకు 19 ఏళ్ల సస్పెన్స్ గా ఉన్న ట్రిపుల్ మర్డర్ కేసును ఏఐ టూల్స్ ద్వారా కేరళ పోలీసులు ఛేదించగలిగారు. సీబీఐ సైతం ఛేదించలేని ఈ ట్రిపుల్ మర్డర్ కేసులో ఏఐ సాధనాలు ఉపయోగించి నిందితులను గుర్తించడమే కాదు. వారి చిరునామాలు కూడా కనిపెట్టడం విశేషం. ప్రస్తుతం అనిల్ కుమార్, రాజేష్ జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.