Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NEET Exams: నీట్ కాదది ఛీట్

నీట్ ఆక్ర మాలు, పేపర్లీడ్ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కా రుపై తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తింది.

ఆ 13 అరెస్టులు ఎందుకు మరి
నీట్ పేపర్ లీక్ కాలేదన్న వ్యా ఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: నీట్( NEET paper ) ఆక్ర మాలు, పేపర్లీడ్ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) మోదీ సర్కా రుపై తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తింది. మోదీ ప్రభుత్వం నీట్ (NEET Scam)కుంభకోణాన్ని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎన్టీఏ ద్వారా కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు(AICC President Kharge) ఖర్గే ఆరోపించారు. నీట్ ఆక్రమాలపై ఆయన సర్కారును ఉద్దేశించి ‘ఎక్స్’లో ప్రశ్నల వర్షం కురి పించారు. కాంగ్రెస్ జనరల్ సెక్ర టరీ ప్రియాంక గాంధీ కూడా ప్రభు త్వంపై మండిప డ్డారు.

“లక్షలాది మంది యువత, వారి తల్లిదండ్రుల ఆందోళనను పట్టించుకోకపోవడం ద్వారా వ్యవస్థలో ఎవరిని కాపాడ డానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంద న్నదే ప్రశ్న” అని ప్రియాంక ధ్వజమె త్తారు.’నీట్’ ఈ ప్రభుత్వ హయాం లో బీట్ లా తయారైందని, కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ధ్వజ మెత్తారు. మోదీ హయాంలో పరీక్ష ల పవిత్రత పదేపదే ప్రమాదంలో పడుతోందని, పేపర్ లీక్లు సాధా రణంగా మారిపోయాయని, నీట్ పేపర్ లీక్ కుంభకోణం కూడా అలాంటివాటిలో ఒకటని ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు. “ఉత్తర ప్రదేశ్లో బీజేపీ పాలనలో 408 పైగా పేపర్ లీక్ ఘటనలు బయటప డ్డాయి.

గుజరా ‘త్ అయితే పేపర్ లీక్లకు(NEET Paper Leakage) రాజధానిగా మారింది. అక్క ణ్నుంచే దేశం మొత్తానికీ పేపర్లు లీక్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్. భారీ వ్యాపం కుంభకోణానికి పేరు మో సింది. ఇలాంటి అక్రమాలు లక్షలాది మంది యువ విద్యార్థుల ఆకాంక్ష లను దెబ్బతీస్తున్నాయి” అని జైరామ్ రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక- కాంగ్రెస్ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం అధిపతి పవన్ ఖేదా అయితే నీట్ కుంభ కోణాన్ని వ్యాప్త్నం 20గా అభివ ర్ణించారు. నీట్ అక్రమాలపై దేశవ్యా ప్తంగా జరుగుతున్న నిరసనలు, కోర్టు కేసులు ఎవరో ప్రేరేపిస్తే జరుగు తున్నవంటూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Union Minister Dharmendra Pradhan) చేసిన వ్యాఖ్యలు.. 24 లక్షల మంది నీట్ అభ్యర్థుల పుం డుపై కారం జల్లినట్టుగా ఉన్నా యని మండిపడ్డారు.

అంతమంది యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నపుడు ప్రధాని మోడీ మౌనంగా ఎందుకు ఉన్నారని ఆయన నిల దీశారు. ‘గత ఏడాది ఈ ఏడాది నీట్ పరీక్షల్లో(NEET Exams) 580కి మించి స్కోర్ చేసిన విద్యార్థులందరి వివరాలూ బయటపెట్టాలి. వారు పరీక్ష రాసిన కేంద్రాల వివరాలను కూడా బహి ర్గతం చేయాలి. అప్పుడు. నీట్ పరీక్ష రాయడానికి ఎంత మంది విద్యార్థులు తాము ఉన్న చోటు నుంచి ఎంత దూరం ప్రయాణించా రో బయటపడుతుంది” అని ఆయ న పేర్కొన్నారు. నీట్లో అవకతవకల పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఫోరె న్సిక్ దర్యాప్తు చేయిస్తేనే వి ద్యార్థులకు మేలు జరుగు తుంద న్నారు. ఇక, సీట్ తరహా ప్రవేశపరీక్ష కుంభకోణాలకు తాము చరమ గీతం పాడతామని, అది తమ బాధ్యత అని తమిళ నాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. “సీట్లో ఆక్ర మాలు జరిగాయని మొట్టమొదట చెప్పింది తమిళ నాడే. ఇప్పుడు యావద్దేశం ఆదే మాట చెబుతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Kharge on comments NEET paper not leaked