–18వ లోక్‌సభ తొలి సమావేశాల ప్రారంభానికి కౌంట్ డౌన్
–తొలి రోజు ప్రధానితో సహా 280 మంది సభ్యుల ప్రమాణ స్వీకారo
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో 18వ లోక్‌సభ తొలి సమావేశాలు (Lok Sabha Sessions) ప్రారంభం కానున్నాయి. జూన్ 24 ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కౌంట్ డౌన్ (COUNT DOWN) అయింది. ముందుగా కొత్త ఎన్నికై న ఎంపీల చేత ప్రమాణ స్వీకారం (Oath taking)చేయించనుండ గా మొద ట ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ మంత్రుల చేత ప్రొటెం స్పీక ర్ భర్తిహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తారు.
అనంత రం కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయిస్తారు. ప్రధా ని మోదీ (PM MODI) తర్వాత రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Sin gh), అమిత్ షా (Amit Shah), నితిన్ గడ్కరీ (Nitin Gadk ari)ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మంత్రి మండ లిలోని ఇతర సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధా ని మోదీ కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లో 58 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు.
కేంద్ర మంత్రి మండలిలోని 13 మంది సభ్యులు రాజ్యసభ ఎంపీలు, ఒక మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు ఏ సభలోను సభ్యులుగా లేరు. లోక్‌సభ ఎన్నిక ల్లో లూథియానా నుంచి బీజేపీ (BJP) టికెట్‌పై పోటీ చేసిన బిట్టు ఓడి పోయారు. ప్రధాని మోదీ, ఆయన మంత్రుల తర్వాత ఆంగ్ల అక్షరమా ల ప్రకారం రాష్ట్రాల వారీగా ఎంపీల తో ప్రమాణం చేయిస్తారు. ఈ పార్ల మెంట్ సమావేశాల్లో జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయం ఉండదు.
అదే విధంగా మొదట మొదటిరోజు అండమాన్ నికోబార్, ఏపీ, అరు ణాచల్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎంపీల ప్రమాణం చేస్తారు. రెండో రోజు తెలంగాణకు (TELANGANA) చెంది న ఎంపీల ప్రమాణస్వీకారం, చివర గా పశ్చిమ బెంగాల్ ఎంపీలు ప్రమా ణ స్వీకారం చేయనున్నారు. జూన్ 24న పార్లమెంట్ సమావేశాల తొలి రోజు కొత్తగా ఎన్నికైన 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయను న్నారు. రెండో రోజు అంటే జూన్ 25న కొత్తగా ఎన్నికైన 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయను న్నారు.
ఒక్కో ఎంపీ ప్రమాణస్వీకా రానికి ఒక నిమిషం సమయం కేటాయి స్తారు. ఆ తర్వాత జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుం ది. జూన్ 27న ఉభయ సభల సంయు క్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌప ది ముర్ము (Draupadi Murmu) ప్రసంగిస్తారు. ఇటీవలి నీట్ పేపర్ లీక్‌పై ప్రతిపక్షాలు గందరగో ళం సృష్టించినప్పటికీ జూన్ 28న రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించేందుకు ప్రభుత్వం ప్రయత్ని స్తుంది.
జూలై 2న మోదీ ప్రసంగం.. రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిస్పంద నగా ప్రధాని నరేంద్ర మోదీ (MODI)జూలై 2న లోక్‌సభలో ప్రసంగించను న్నా రు. జూలై 3న రాజ్యసభలో (Rajya Sabha) మాట్లాడనున్నా రు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని కటక్‌కు చెందిన బీజేపీ ఎంపీ భర్త్రీహరి మహతాబ్ ను ప్రొటెం స్పీకర్‌గా నియమించి నట్లు కేంద్ర పార్లమెంటరీ (Parliamentary)వ్యవహారా ల శాఖ మంత్రి కిరెన్ రిజిజు జూన్ 20న తెలిపారు.
స్పీకర్ ఎన్నిక జరి గే వరకు ప్రొటెం స్పీకర్‌కు సహాయం గా సురేష్ కోడికున్నిల్, తాళికోట్టై రాజుతేవర్ బాలు, రాధా మోహన్ సింగ్, ఫగ్గ న్ సింగ్ కులస్తే, సుదీప్ బందోపాధ్యాయలను రాష్ట్రపతి నియమిం చారు.ఇదిలావుంటే, పార్లమెంటు దిగువ సభ అంటే లోక్‌సభలో బీజేపీకి స్పీకర్ పదవి లభించే అవకాశం ఉంది.
అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్‌డీఏ మిత్రపక్షాలలో ఒకరికి ఇవ్వవచ్చు. సాంప్రదాయకంగా ఎప్పుడూ ప్రతి పక్షానికి వెళ్లే డిప్యూ టీ స్పీకర్ పదవి ని ఇండియా కూటమి డిమాండ్ చేసింది.అయితే 17వ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ లేరు. అయితే, బీజేపీ నేతృత్వం లోని ఎన్‌డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రెండూ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవికి అభ్యర్థుల పేర్లను ప్రకటించకపోవ డం గమనార్హం.