మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
ఆర్మీ ట్రక్కు బస్సు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్‌లో సోమవారం చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్రమాదం మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్‌గఢ్ జిల్లాలో జరిగింది.
ట్రక్కు, బస్సు ఢీకొని ఐదుగురు దుర్మరణం
ప్రజా దీవెన, మధ్యప్రదేశ్: ఆర్మీ ట్రక్కు బస్సు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్‌లో సోమవారం చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్రమాదం మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్‌గఢ్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు, మరో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. జిల్లాలోని పిలుఖేడిలోని ఎన్‌హెచ్ 46లోని ఓస్వాల్ ఫ్యాక్టరీ ముందు ప్రమాదం చోటు చేసుకుం ది. ప్రయాణికులతో నిండిన బస్సు భోపాల్ వైపు ప్రయాణిస్తుండగా ఈ సమయంలో ఎన్‌హెచ్ 46లోని ఓస్వాల్ ఫ్యాక్టరీ ముందు అకస్మా త్తుగా ఆర్మీ ట్రక్కు టైరు పగిలి బస్సును ఢీకొట్టింది.
ఈ ప్రమాదం లో బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు, ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి చుట్టుపక్కల వారు పోలీసులకు, 108 అంబులె న్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలిం చారు. ఓస్వాల్ ఫ్యాక్టరీలో పనిచేస్తు న్న ఓ ఉద్యోగి కూడా ఈ ప్రమాదం లో మృతి చెందాడు. అతడు బీహా ర్ వాసి అని తెలిపారు. ప్రమాదం సమాచారంపై పలువురు ఆర్మీ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Madhya Pradesh Rajgarh