Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahakumbha Mela : మహాకుంభమేళాలో మహాఘోరం

–త్రివేణి సంగ‌మం తొక్కిస‌లాట‌లో 40 మంది భ‌క్తులు మృతి, వంద మందికి పైగా గాయాలు

Mahakumbha Mela : ప్రజా దీవెన, కుంభమేళ: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగ రంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభ మేళాలో బుధవారం ఆకస్మాత్తుగా అప‌శృతి చోటుచేసు కుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కి సలాట జ‌రిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 20మంది భక్తులు మరణించారు. మ‌రో వంద మంది గాయ‌ప‌డ్డారు. మౌని అమావా స్యను పురస్కరించుకుని మూడో అమృత స్నానం కోసం పెద్ద సంఖ్య లో ప్రయాగ్రాజ్ కు భక్తులు తరలిరా వడంతో బుధవారం తెల్లవారుజా మున 2 గంటల సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో సెక్టార్-2లోని భక్తుల తాకి డికి బారికేడ్లు విరిగి భారీ తొక్కిస లాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 40 మంది మృతిచెంద‌ గా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భ‌య‌ప‌డుతు న్నారు.ఘటన జరిగిన వెంటనే స్పందించిన సిబ్బంది.. గాయపడిన వారిని చికిత్స కోసం అంబులెన్సు ల్లో సమీప ఆస్పత్రులకు తరలించా రు. గాయ‌ప‌డిన వారికి అత్య‌వ‌స‌ర చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే త్రివేణి సంగమం ఘాట్ ను మూసివేశారు.

ఈ ఘాట్ కు భ‌క్తులు రావ‌ద్ద‌ని, ఇత‌ర ఘాట్ ల‌లో పుణ్య స్నానా లు ఆచ‌రించాల‌ని మైకుల‌లో ప్ర‌చారం చేశారు.ఇది ఇలా ఉంటే . ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభు త్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చే సింది. సమగ్ర విచారణకు ఆదేశిం చింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సి బ్బంది రంగంలోకి దిగారు. సహాయ క చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాలో సంగం ఒడ్డున జరిగిన తొక్కిసలాటపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సంగం, అఖారా మార్గ్ వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉందని తెలిపారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తూ, పోలీసులు, పరిపా లనా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. భక్తులు ఎక్కడ ఉన్నా అక్కడే స్నానం చేయొచ్చని, ప్రత్యేకంగా త్రివేణి సంగ‌మం వద్దకే రావాల్సిన అవసరం లేదని సీఎం యోగి తెలిపారు.మీడియాతో మా ట్లాడిన సీఎం యోగి ఆదిత్య నాథ్.. మహాకుంభం మేళాలో నిన్న ఒక్క రోజే 5.5 కోట్ల మంది పవిత్ర స్నా నం చేశారని వెల్లడించారు.

అలాగే మోనీ అమ‌వాస్య సంద‌ర్భంగా సు మారు 10 కోట్ల మంది భ‌క్తులు రానుండ‌టంతో రద్దీ వల్ల సంగం వద్ద ఒత్తిడి పెరిగిందని చెప్పారు. పరిపాలనా యంత్రాంగం అప్రమ త్తంగా వ్యవహరిస్తోందని, భక్తుల భద్రత కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బుధవారం ఉదయం అఖారా మా ర్గ్‌లోని బారికేడ్లను దాటేందుకు ప్ర యత్నించిన భక్తుల కారణంగా తొక్కిసలాట జరిగిందని సీఎం యోగి వివరించారు. ఈ ఘటనలో కొందరు భక్తులు గాయపడగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. స్థానిక పరిపాలనా అధికారులు భద్రతా చర్యలు మరింత కట్టుది ట్టం చేశారని చెప్పారు. ఇక నేటి ఉద‌యానికే వివిధ ఘాట్ ల‌లో సుమారు ఎనిమిది కోట్ల మంది పుణ్య‌స్నానాలు ఆచ‌రించార‌న్నా రు.

 

 

అమృత స్నానాలు ర‌ద్దు చేసు క‌న్న అఖ‌డాల ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో తొక్కిసలా టతో అఖాడా పరిషత్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమ వాస్య సందర్భంగా అమృత స్నానా లు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పరిషత్ అధ్యక్షుడు రవింద్ర పూరి వెల్ల డించారు. వసంత పంచమి రోజున స్నానానికి రావాలని విజ్ఞప్తి చేశా రు. నాగ‌సాధువులు, అఖ‌డాలు త‌మ త‌మ గుడారాల‌లోనే ఉండా ల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. “ఈ సంఘటన జరిగినందుకు మేము బాధపడుతున్నాము. వేలాది మం ది భక్తులు మా వెంట ఉన్నారు… ప్ర జల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టు కుని, ఈ రోజు స్నానంలో అఖాడా పరిషత్ పాల్గొనకూడదని నిర్ణయిం చుకున్నాం. ప్రజలకు నా విజ్ఞప్తి, ఈ రోజు కాకుండా వసంత పంచమి రోజు స్నానానికి రావాలని పూరి చెప్పారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రధా న మంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాం తి …ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ప్రయాగ్జ్ మహా కుంభమే ళాలో తొక్కిసలాట ఘటన బాధా కరం. బాధిత కుటుంబాలకు ప్రగా ఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని రా ష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నా రు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ ఘటన కలచివే సిందని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటో న్నానని అన్నారు. మృతుల కు టుంబాలకు సానుభూతిని, సంతా పాన్ని తెలియజేశారు. “ప్రయాగ్జ్ మహా కుంభమేళా లో చోటుచేసు కున్న విషాదం తీవ్ర విచారకరం. ఈ ఘటనతో తమ ప్రియమైన వారిని కోల్పోయిన భక్తులకు ప్రగాఢ సాను భూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రు లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తు న్నా. బాధితులకు స్థానిక యంత్రాం గం అన్నివిధాలా సాయం చేస్తోంది. దీని గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ తోనూ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరు పుతున్నాఅని ట్విట్ చేశారు.

 

 

ఇకఈ ఘటన పట్ల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖి ల భారత కాంగ్రెస్ కమిటీ అధి నేత మల్లికార్జున్ ఖర్గే స్పందిం చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడ్డ వాళ్లు వేగంగా కోలుకో వాలని ఆకాంక్షించారు. వారికి మె రుగైన వైద్య సహయాన్ని అందజే యాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. నిర్వహణ లోపలే దీనికి కారణమని రాహుల్ గాంధీ, ఖర్గే వ్యాఖ్యానించారు. అమృత్ స్నాన్ చేయడానికి దేశం నలుమూ లల నుంచి కోట్లాదిమంది భక్తులు వస్తారని తెలిసి కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవ హ రించిందని ఆరోపించారు. సామా న్య భక్తుల కంటే వీఐపీల సేవలో అధికారులు తరించారని విమర్శిం చారు. మహా కుంభమేళా ముగియ డానికి ఇంకా చాలా సమయం ఉందని, అమృత్ స్నాన ఘడియ లు, తేదీలు ఇంకా ఉన్నాయని, ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలను తీసుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. వీఐపీ కల్చర్‌కు పుల్ స్టాప్ పెట్టాలని, సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్షతగాత్రులకు వీలైనంత సహాయం అందజేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్ర‌త్య‌క రైళ్లు.. బస్సులు ర‌ద్దు
మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళా లో విపరీతమైన రద్దీ కారణంగా తొక్కిసలాట తో దీనద యాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్లడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లను నిలిపివేసి నట్లు పండిట్ దీనదయాళ్ ఉపా ధ్యాయ రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ మనీష్ కుమార్ తెలిపా రు. అధికారుల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సాధారణ రైళ్లు మాత్రమే ప్రజలకు అందుబా టులో ఉంటాయని అన్నారు.

పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం ఘాటు భక్తులు వస్తున్న వాహనాలు, బస్సులను ప్రయాగ్జ్ సరిహద్దుల్లో 24 గంటల పాటు నిలిపివేశామన్నారు జిల్లా మేజిస్ట్రేట్ దినేష్ చంద్ర పేర్కొ న్నా రు. కుంభమేళా ప్రాంతంలో ఇప్ప టికే పది కోట్ల మంది ప్రజలు ఉన్న ట్లు అధికారులు అంచనా వేస్తుండ డంతో 24 గంటల పాటు ఇతరుల ను అనుమతించట్లేదని పేర్కొన్నా రు. మరోవైపు.. ఇతర ప్రాంతాల నుంచి ప్రయాగ్ కు వస్తున్న రైలు స‌ర్వీస్ ల‌ను ఆపివేయలేదని భారతీయ రైల్వే అధికారులు తెలిపారు అయితే ప్ర‌యోగ‌లో ర‌ద్దీ దృష్ట్యా దీన్ ద‌యాళ్ స్టేష‌న్ లోనే నిలిపివేస్తున్నామ‌న్నారు.. ఇక్క‌డ ప‌రిస్థితి చ‌క్క‌బ‌డిన త‌ర్వాతే రైళ్ల‌ను ప్ర‌యోగ‌కు న‌డుపుతామ‌ న్నారు.. ఇక తిరుగు ప్ర‌యాణం కోసం ప్రయాగ్రాజ్ నుంచి భక్తులను తిరిగి తీసుకువెళ్లేందుకు అదనంగా దాదాపు 360 ప్రత్యేక రైళ్లను ఏర్పా టుచేశామన్నారు. రైల్వేస్టేషన్లో రద్దీని ఎప్పటికప్పుడు నివారించ డానికి తగిన చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ప్రజలు భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు.