Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NEET UG-2024: రేపే మెడిక‌ల్ ప్ర‌వేశ పరీక్ష

దేశవ్యాప్తం గా వైద్య,విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్షను ఆదివారం నిర్వ‌హించ‌ను న్నారు.

దేశ వ్యాప్తంగా ప‌రీక్ష రాయ‌నున్న 24 ల‌క్ష‌ల మంది
ఇప్ప‌టికే హాల్ టికెట్స్ జారీచేసిన ఎన్ఎటి
ఒక్క నిమిషం ఆల‌స్య‌మైన నో ఎంట్రీ

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశవ్యాప్తం గా వైద్య,విద్య కోర్సుల్లో(Medical entrance exam) ప్రవేశాల కోసం నీట్ యూజీ-2024(NEET UG-2024) ప్రవేశ పరీక్షను ఆదివారం నిర్వ‌హించ‌ను న్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరుగునున్న ఈ పరీక్ష కోసం ఇప్ప టికే అడ్మిట్(admit cards) కార్డులను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు కాకుండా, ఈ పరీక్ష మొత్తం 13 భాషలలో పెన్, పేపర్ విధానంలో నిర్వహించ‌నున్నారు. ఎంబీబీఎస్(MBBS), బీడీఎస్(BDS), బీఎస్‌ఎంఎస్, బీయూఎం ఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహించడం ఆనవాయితీ.

ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైన ప‌రీక్షా కేంద్రాల‌లోకి అనుమ‌తించ‌బోరు. ఇక అభ్యర్థులు హాల్ టికెట్​తో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ వెంట తీసుకురా వలసి ఉంటుంది. తెలంగాణ‌లో ప్ర‌ధాన న‌గ‌రాల‌లోనూ, ముఖ్య‌మైన ప‌ట్ట‌ణాల‌లోనే ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ప‌రీక్షా కేంద్రాల‌ను ఒక రోజు ముందుగానే ప‌రిశీలించు కోవాల‌ని నిర్వాహ‌కులు విద్యార్ధు ల‌కు సూచించారు.

Medical entrance exam tomorrow