Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Modi meditation politics: రాజకీయంలో మోదీ ధ్యానం

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనున్న నేపద్యంలో కన్నియాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం అంశం రాజకీయ రంగు పులుముకుంది.

మోడీ ధ్యానంపై ఎన్నికల సంఘానికి సిపిఐ(ఎం) లేఖ
బీజేపీపై ప్రతిపక్షాలు ముకుమ్మడి గా విమర్శనాస్త్రాలు
మోదీ ధ్యానాన్ని మీడియాలో ప్ర సారం చేస్తే ఎన్నికల కోడ్‌ను ఉల్లం ఘించడమే

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లోక్ సభ సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనున్న నేపద్యంలో కన్నియాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ధ్యానం అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఈ సందర్భంలో బీజేపీపై ప్రతిపక్షాలు ముకుమ్మడిగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. అయితే ప్రధాని మోదీ ధ్యానం అంశాన్ని మీడియా లో ప్రసారం చేయవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సీపీఐ (ఎం) విజ్జప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి కె. బాలకృష్ణన్ (K.Balakrishnan)..  ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మోదీ ధ్యానం అంశా న్ని ఓ వేళ మీడియాలో ప్రసారం చేస్తే అది ఎన్నికల కోడ్‌ను ఉల్లం ఘించడమే అవుతుందన్నారు.

అంతేకాదు ఇది బీజేపీకి(BJP) లాభం చేకూరుస్తుందని ఈసీకి రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. మోదీ ధాన్యం అంశాన్ని అటు మీడియాలో ఇటు సోషల్ మీడి యాలో ప్రచారం చేస్తే ప్రధాని మోదీ కి, ఆయన పార్టీకి పెద్ద ప్రచారం లభించినట్లు అవుతుందని పేర్కొ న్నారు. మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్(Congress) పార్టీతోపాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సైతం స్పందించిన సంగతి తెలిసిందే. మోదీ ధ్యానం అంశం మీడియాలో ప్రసారమైతే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ధ్యానం చేసుకునే వారు ఎవరైనా కెమెరా తీసుకు వెళ్తారా అంటూ ఆమె వ్యంగ్యంగా ప్రశ్నించారు.

ఏడో దశ ఎన్నికల ప్రచా రం ఈరోజు సాయంత్రంతో ముగి యనుండగా తమిళనాడులోని కన్నియాకుమారిలో వివేకానంద శిలా స్మారకం(Vivekananda Shila Memorial)వద్ద 48 గంటలపాటు ధ్యానం చేస్తానని ప్రధాని మోదీ ఇటీ వల ప్రకటించారు. దాంతో రాజకీ యంగా దుమారం రేగింది. ఇదంతా ఎన్నికల్లో గెలుపు కోసం చేస్తున్నా రంటూ ప్రధాని మోదీపై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. అంతేకాదు జూన్ 4వ తేదీ ఫలితా లు వెలువడే రోజు వరకు ఎన్నికల కోడ్(Election Code)అమల్లో ఉంటుందని, ఆ తర్వాత ఎవరు ఎక్కడ ధ్యానం చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని ఇప్పటికే ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఇంకో వైపు ప్రధాని మోదీ మరికాసే పట్లో కన్నియాకుమారికి వస్తు న్నారు. ఈ నేపథ్యంలో 2 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Modi meditation politics says CPIM