Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Italy G7 Summit: భారత్ లో నా గెలుపు ప్రపంచ ప్రజాస్వామ్య విజయం

భారత్‌లో ఇటీ వలి ఎన్నికలు అత్యంత న్యాయం గా జరిగాయని ప్రధాన మంత్రి మో దీ పేర్కొన్నారు. ప్రతి అంచెలోనూ విస్తృత స్థాయి సాంకేతికత విని యోగంతో పూర్తి పారదర్శకతతో నిర్వహించారని గుర్తు చేశారు.

సాంకేతికతలో గుత్తాధిపత్యం ఎప్పటికీ సరికాదు
ఇటలీ జి7 సదస్సులో ప్రధాని మోదీ పిలుపు

ప్రజా దీవెన, ఇటలీ: భారత్‌లో ఇటీ వలి ఎన్నికలు అత్యంత న్యాయం గా జరిగాయని ప్రధాన మంత్రి మో దీ పేర్కొన్నారు. ప్రతి అంచెలోనూ విస్తృత స్థాయి సాంకేతికత విని యోగంతో పూర్తి పారదర్శకతతో నిర్వహించారని గుర్తు చేశారు. తా ను మరోసారి గెలవడం ప్రజాస్వా మ్య ప్రపంచానికంతటికీ విజయం లాంటిదని అభివర్ణించారు. ఇటలీ లోని అపూలియాలో జరుగుతున్న జి7 దేశాల(Italy G7 Summit) కూటమి సదస్సులో శుక్ర వారం ఆయన మాట్లాడారు. సాంకే తికతలో గుత్తాధిపత్యం పోవాలని, ఫలితాలు అందరికీ అందాలని ఆకాంక్షించారు. సమ్మిళిత సమా జానికి పునాది వేసేందుకు, అసమా నతలు రూపుమాపేందుకు ఇది అవసరమని పేర్కొన్నారు.

కృత్రిమ మేధను(Artificial intelligence) పారదర్శకంగా, నిష్పక్షపా తంగా, సురక్షితంగా అందుబాటు లోకి తెచ్చేందుకు అన్ని దేశాలతో కలిసి పనిచేస్తూనే ఉంటామని ప్రక టించారు.అభివృద్ధి చెందుతున్న దేశాలు (గ్లోబల్‌ సౌత్‌) ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు, ఉద్రిక్తతల కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటు న్నాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు దేశాల ప్రాధామ్యా లు, ఆందోళనలను ప్రపంచ వేదికపై వెల్లడించడాన్ని భారత్‌ తన బాధ్య తగా స్వీకరించిందని పేర్కొన్నారు. ఆఫ్రికా యూనియన్‌ను జి20 శాశ్వ త సభ్యురాలిగా చేర్చుకుని తాము అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన సంగ తిని గుర్తుచేశారు. ఏఐ అందరికీ అంటూ కృత్రిమ మేధపై జాతీయ విధానం రూపొందించిన అతి తక్కు వ దేశాల్లో భారత్‌ ఒకటని, మానవ కేంద్రీకృతంగా ఉంటేనే సాంకేతికత విజయవంతం అవుతుందని, టెక్నా ల జీని విధ్వంసానికి కాదని, అభి వృద్ధికి వాడాలని ఈ ధోరణితోనే మేం ముందుకెళ్తున్నామని ప్రధాని వివరించారు.

పర్యావరణాన్ని కాపా డేందుకు అందరూ మొక్కలు నాటా లని పిలుపునిచ్చారు.జి7 సదస్సు లో(Italy G7 Summit) మోదీ బ్రిటన్‌, ఇటలీ ప్రధానులు రిషి సునాక్‌, మెలోనీ, ఫ్రాన్స్‌, ఉక్రె యిన్‌ అధ్యక్షులు మేక్రాన్‌, జెలెన్‌ స్కీతో సంభాషించారు. క్రైస్తవ మత పెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌ను(Christian Pope Francis) హత్తుకుని, కొద్దిసేపు మాట్లాడారు. రష్యాతో యుద్ధం పరిస్థితిని జెలెన్‌స్కీ వివ రించగా చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాంతి నెలకొనే వీలు ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీ ఏ) చర్చల పురోగతిపై సునాక్‌తో సంభాషించారు. రక్షణ, సెమీ కండక్ట ర్లు, సాంకేతికత, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాల సంబంధాలను మరింత విస్తృతం చేసేందుకు చాలా అవకా శాలు ఉన్నాయని ట్వీట్‌ చేశారు. మేక్రాన్‌తో వ్యూహాత్మక భాగస్వా మ్యం, రక్షణ, అణు, సాంకేతికత, కృత్రిమ మేధ, సముద్ర మార్గ వాణిజ్యం, అంతరిక్ష రంగాల్లో సంబధాలను పటిష్ఠం చేసుకోవ డంపై చర్చించారు. కాగా, మెలోని సదస్సుకు మోదీని ఆహ్వానిస్తూ భారతీయ పద్ధతుల్లో రెండు చేతు లూ జోడించి నమస్కారం చేశారు. మోదీ సైతం ఆమె ప్రతి నమస్కారం చేశారు.

Modi victory is global democracy