BJP MP Laxman: ఫోన్ ట్యాపింగ్ పై ముఖ్యమంత్రి మౌనమేల
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు లో అనేక సంచలనా త్మక విష యాలు బయటపడుతు న్నా యని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
కేసు దర్యాప్తులో సంచలనాలు వెల్లడవుతున్నా సీఎం మౌనమే
కాళేశ్వరం, టీఎస్పీఎస్సీ ప్రశ్నాప త్రాల లీక్‌పై చర్యలేవి
మీడియా సమావేశంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
ప్రజా దీవెన, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్(Phone tapping) కేసు దర్యాప్తు లో అనేక సంచలనా త్మక విష యాలు బయటపడుతు న్నా యని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. అయినా కేసు వ్యవహారం పట్టనట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవ హరిస్తోందన్నారు. తప్పు చేస్తే జైలు కు పంపిస్తామని చెప్పిన సీఎం రేవం త్ ఇన్ని సంచలనాత్మక విషయాలు బయటకు వస్తుంటే ఎందుకు చర్య లు తీసుకోవడం లేదని ప్రశ్నించా రు. కాళేశ్వరం స్కామ్, పబ్లిక్ సర్వీ స్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీక్‌పై చర్యలు ఏవన్నారు. పోలీసు అధి కారులు, కేసీఆర్ ప్రమేయంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిందితుడు వాంగ్మూలంలో చెప్పారన్నారు.
మాజీ సీఎం కేసీఆర్(KCR) రాష్ట్రంలో మాఫియా నడిపించారని మండి పడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల ఫోన్లు, చివరికి జడ్జిల ఫోన్లూ ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా ఉన్న రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. అధిష్ఠానం ఒత్తిడికి లొంగిపోయారా అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్(BRS) అక్రమ సంపా దనను తరలించి పోలీస్(Police) వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశార న్నా రు. కేసీఆర్, హరీశ్ రావు డైరెక్షన్ లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీస్ అధికారులు చెప్పారన్నారు. ఇంత స్పష్టంగా తెలుస్తున్నా ముఖ్య మంత్రి ఎందుకు చర్యలు తీసుకో వడం లేదని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నిం చారు.
ఎన్నికల అనం తరం కాంగ్రెస్(Congress) లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఎంపీ లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఫేక్ సినిమా డ్రామా అని తానే ముందే చెప్పాన న్నారు. “లిక్కర్ కేసులో కవితను గట్టెక్కించేందుకు ఎమ్మెల్యేల(MLA) కేసు బయటకు తీసుకొచ్చారు. దారు ణమైన స్థితికి కేసీఆర్ దిగజారిపో యారు. రేవంత్‌పై ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఉంది. లేదంటే వెంటనే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు, పాత్ర దారులపై చర్యలు తీసుకోవాలి. కేసును వెంటనే సీబీఐకి అప్ప గించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
MP laxman sensational comments phone tap