Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narendra Modi: పొదుపు నీటి వాడకం అందివచ్చే అధికఫలం

–ప్రపంచoలో ప్రస్తుతమిదే సాగు మంత్రం
–తక్కువ నీటితో అధిక కాపునిచ్చే బ్లాక్‌ బియ్యం
–తృణధాన్యాలతోనే ఆహారభద్రత సాకారం
–అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక వేత్తల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి

Narendra Modi:ప్రజా దీవెన, న్యూఢిల్లీ : తక్కువ జలాలతో అధిక ఫలసాయం అం దించే సాగు పద్ధతులే ప్రపంచానికి ఆహారభద్రతను సమకూర్చగలవని ప్రధాని మోదీ (Narendra Modi) అన్నారు. దీనికోసం బ్లాక్‌ రైస్‌, తృణధాన్యాల (Black rice, whole grains) సాగుపై దృష్టి సారించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సును(ఐసీఏఈ) శనివారం ఢిల్లీలో ఆయన ప్రారంభించారు. వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతతోపాటు పోషక విలువలు కలిగిన పంటలను పండించడం ప్రపంచానికి పెద్ద సవాల్‌గా మారిందని మోదీ అన్నారు. ఆహార భద్రత సమస్యకు పరిష్కారం చూపేలా భారత్‌ అడుగులు వేస్తోందన్నారు. వాతావరణ పరిస్థితులను తట్టుకుని మంచి పంటను అందించే సాగు విధానాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నామనీ, ఈ ఏడాది బడ్జెట్‌లో (budget) ఈ అంశానికి పెద్దపీట వేశామని మోదీ తెలిపారు.

‘‘అన్నిరకాల వాతావరణాలను తట్టుకోగల 1900 రకాల కొత్త వంగడాలను గత పదేళ్లలో రైతులకు అందించాం. ఈ వంగడాలకు సాధారణ వరి పంటలతో పోల్చితే 25% జలాలు సరిపోతాయి. బ్లాక్‌రైస్‌ అందరికీ ఇష్టమైన ఆహారంగా మారింది. ముఖ్యంగా మణిపూర్‌, అసోం, మేఘాలయలో (Manipur, Assam, Meghalaya) ఈ రకం వరి ఆహారాన్ని బాగా తింటున్నారు’’ అని తెలిపారు. ప్రపంచం సూపర్‌ ఫుడ్‌గా భావించే తృణధాన్యాల అతి పెద్ద ఉత్పత్తిదారుగా భారత్‌ మారిందని చెప్పారు. కాగా, ఐసీఏఈ సదస్సు 65 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో జరగడం ఇదే మొదటిసారి. ఆ సదస్సు తొలిసారి జరిగినప్పుడు కొత్తగా అప్పుడే భారత్‌ స్వాతంత్య్రం పొందిందని మోదీ గుర్తుచేశారు. అప్పట్లో వ్యవసాయ రంగంలో సమస్యలతో తిండి గింజలకు కటకట పడిన దశ నుంచి ఆహార ఉత్పత్తిలో సంపూర్ణ సంవృద్ధిని ఇప్పుడు భారత్‌ సాధించిందని ప్రధాని గుర్తుచేశారు. పాల ఉత్పత్తిలో, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల సాగులో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని వివరించారు. దేశాభివృద్ధి వ్యూహంలో వ్యవసాయం అతి కీలక రంగంగా మారిందని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌ అన్నారు. కాగా, 70 దేశాల నుంచి వెయ్యిమంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

మోదీకి అత్యంత ఆదరణ
— ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మొదటి స్థానం
ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ (Narendra Modi)మరోసారి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ ఈ మేరకు నిర్వహించిన సర్వే తాజా వివరాలను ప్రకటించింది. ఇందులో 69% మద్దతుతో మోదీ (Narendra Modi) ప్రపంచం లోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు. ఆయన తర్వాత మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ రెండో స్థానంలో ఉన్నారు. జాబితాలో 3 నుంచి 10 స్థానాల్లో వరుసగా అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మెలీ, స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ కౌన్సిలర్‌ వియోలా, ఐర్లాండ్‌(Manipur, Assam, Meghalaya) మంత్రి సైమన్‌ హ్యారిస్‌, యూకే ప్రధాని స్టార్మర్‌, పోలాండ్‌ మాజీ ప్రధాని టస్క్‌, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ , స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌, ఇటలీ ప్రధాని మెలోనీ ఉన్నారు.