Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NDA Alliance:కేంద్రంలో తిరిగి ఎగిరిన ఎన్డీయే జెండా

సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో తిరిగి ఎన్డీయే జెండా మరోమారు ఎగిరేసింది. కాకపోతే నరేంద్ర మోదీ ఏకచ్ఛ త్రాధిపత్యానికి బ్రేక్ పడిందని చెప్ప వచ్చు. పార్లమెంటు ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఓటర్లు ఎన్డీయేకు పట్టం కట్టారు.

బిజేపీకి సొంతంగా 241 స్థానాలు, కీలకంగా టీడీపీ, జేడీయూ
కాంగ్రెస్ 99 సీట్లు సాధించి 233 ఇండియా కూటమి స్థానాలతో సత్తా
బీజేపీని దెబ్బతీసిన యూపీ, మ హారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజ స్థాన్, కర్ణాటక రాష్ట్రాలు
ఎన్డీయేను ఆదుకున్న ఏపీ, బిహా ర్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా లు
నేడు ఢిల్లీలో ఎన్డీయే భేటీ నాయ కుడి ఎంపికకు కసరత్తు

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో(General election)కేంద్రంలో తిరిగి ఎన్డీయే జెండా మరోమారు ఎగిరేసింది. కాకపోతే నరేంద్ర మోదీ ఏకచ్ఛ త్రాధిపత్యానికి బ్రేక్ పడిందని చెప్ప వచ్చు. పార్లమెంటు ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఓటర్లు ఎన్డీయేకు(NDA) పట్టం కట్టారు. ఇది ‘మోదీ గ్యారెంటీ’ అని పదే పదే హామీ ఇచ్చినా బీజేపీని మాత్రం మేజిక్ మార్కును దాటని వ్వలేదు ఫలితంగా ఈ దఫా కేంద్రం లో సంకీర్ణ సర్కారు ఏర్పాటు కా నుంది. సంపూర్ణ ఆధిపత్యం పోయి మిత్రులపై ఆధారపడి మాత్ర మే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయా ల్సిన అనివార్య పరిస్థితి బీజేపీకి(BJP) ఎదురైంది. అదే సమయంలో ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుంది. కానీ మేజిక్ మార్కు ను చేరుకోలేకపోయింది. కేంద్రంలో 18వ లోక్ సభ కొలువుదీరడానికి ఏడుదశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వాటి ఫలితాలు మంగళవారం వెలు వడ్డాయి. వీటిలో 241 సీట్లను సాధించి బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించిoది. ఆ పార్టీ నేతృ త్వంలోని ఎన్డీయే 293 స్థానాల్లో ఘన విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబో తోంది.

ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు అవసరం కాగా ఆ క్రమంలో అత్తెసరు మెజారిటీతో ఎన్టీయే మేజిక్ మార్కును దాటిoది. అదే సమయంలో గత ఎన్నికల్లో కేవలం 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి 99 సీట్లు సాధించి ఆ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి కూడా గతం కంటే భారీగా బలప డింది.ఈసారి ఎన్నికల్లో 233 స్థానా ల్లో ఘన విజయం సాధించింది.
గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో సొం తంగానే మేజిక్ మార్కు దాటిన బీజేపీ ఈసారి ‘టార్గెట్ 370’ అం టూ బరిలోకి దిగింది. ఎన్డీయే కూటమిగా 400కుపైగా సీట్లను సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. కానీ, తుది ఫలితాల్లో అత్తెసరు మెజారిటీతోనే ఎన్డీయే మేజిక్ మార్కును దాటింది. ఎన్డీయే మిత్ర పక్షాల్లో టీడీపీ, జనసేన సాధించిన 18 స్థానాలుబీ జేడీయూకు వచ్చిన 12 సీట్లు కీలకంగా మారాయి. ఆయా పార్టీలకు చెందిన 30 మంది ఎంపీలు మద్దతు ఇస్తేనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. అదే సమయంలో, ఇండి కూటమికి కూడా మేజిక్ మార్కు చేరడానికి దాదాపు 40 సీట్లు తగ్గాయి. ఈ నేప థ్యంలోనే, రాజకీయ గండర గండదు శరద్ పవార్ రంగంలోకి దిగినట్లు ప్రచారం జరిగింది.

ఆయన అటు నితీశ్ కుమార్(Nitish Kumar)నూ ఇటు చంద్రబాబుతోనూ మాట్లాడిన ట్లు వార్తలు వచ్చాయి. ఈ సంద ర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తా మని కూడా ఇండియా కూటమి నేతలు ప్రతిపాదించినట్లు తెలి సింది. ఈ నేపథ్యంలోనే, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజ యంపై అభినందించారు. ఎన్డీయే కన్వీనర్ గా మళ్లీ బాధ్యతలు చేప ట్టాలని చంద్రబాబును(Chandrababu)అమిత్ షా కోరినట్లు సమాచారం. తాజా పరి ణామాల నేపథ్యంలోనే ఎన్డీయే కూటమి బుధవారం ఢిల్లీలో సమా వేశం కానుంది. దీనికి చంద్రబాబు సహా కూటమి నేతలు హాజరు కాను న్నారు. ఈ సమావేశం తర్వాత కూటమి భవిష్యత్తు, ప్రధాన మంత్రి(Prime Minister)ఎవరనే అంశాలపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. మరోవైపు, ఇండి కూటమి కూడా తన ప్రయత్నాలు తాను చేస్తూనే బుధవారం దేశ రాజధానిలో విస్తృతంగా సమావేశా లు జరపనుంది.

మేజిక్ మార్కుకు దాదాపు 40 సీట్ల దూరంలో నిలిచి పోయిన బీజేపీకి(BJP) ఆ పార్టీకి కంచు కోటగా నిలిచిన ఉత్తరప్రదేశ్, మహా రాష్ట్రల్లో గట్టి ఎదురు దెబ్బ తగి లింది. శతాబ్దాల కలను సాకారం చేస్తూ రామ మందిరాన్ని నిర్మించినా యూపీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్ట లేదు. చివరికి, అయోధ్య రామమం దిరం(Ayodhya Rammamdiram)కొలువైన ఫైజాబాద్ నియోజ కవర్గంలోనూ బీజేపీ ఓటమి పాలైం ది. ఇంకా చెప్పాలంటే ఫలితాలు వెలువడడం మొదలైన తొలి రౌండ్ల లో వారాణసీలో ప్రధాని మోదీ దాదాపు ఆరు వేల ఓట్ల వెనుకంజ లో ఉన్నారు. చివరికి, ఆయన లక్షన్నర ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కానీ, గత ఎన్నికలో పోలిస్తే ఇక్కడ ఆయన మెజారిటీ దాదాపు మూడు లక్షల ఓట్లు తగ్గిపోవడం విశేషం. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 71, 62 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి కేవలం 33 సీట్లకే పరిమితమైంది. ఇక్కడ మతం కంటే కులానిదే పైచేయి అయింది.

యూపీలో కాంగ్రెస్,(Congress) సమాజ్ వాది పార్టీ జట్టుకట్టడం.. గతంలో టికెట్ల కేటాయింపులో యాదవులకే పెద్దపీట వేసిన అఖిలేశ్ ఈసారి యాదవేతరులకు ఎక్కువ సీట్లు ఇవ్వడం మాయావ తి ప్రభ మసకబారి దళితుల ఓట్లు కాంగ్రెసకు బదిలీ కావడంతో ఇక్కడ ఇండియా కూటమి అనూహ్య ఎక్కువ స్థానాలను సొంతం చేసు కుంది. ఏకంగా 43 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఒక్క యూపీ లోనే బీజేపీకి దాదాపు 30 సీట్లు తగ్గిపోయాయి. ఇక, అధికారం కోసం మహారాష్ట్రలో పార్టీలను చిన్నభిన్నం చేయడంతో అక్కడి ఓటర్లు బీజేపీపై విముఖత చూపా రు. అందుకే, గత ఎన్నికల్లో మహా రాష్ట్రలో ఎన్డీయేకు 41 సీట్లు రాగా ఇప్పుడు కేవలం 20 స్థానాలే దక్కా యి. అప్పట్లో 23 సీట్లను గెలుచుకు న్న బీజేపీని ఈసారి పది స్థానాలకు పరిమితం చేశారు. ఇక్కడ బీజేపీకి మరో 13 సీట్లు తగ్గాయి. ఇక పశ్చి మ బెంగాల్లో(West Bengal)కూడా బీజేపీకి ఎదు రు దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో ఇక్కడ 19 సీట్లను గెలుచుకున్న బీజేపీ ఈసారి 10 స్థానాలకే పరి మితమైంది. రాజస్థాన్ గత ఎన్ని కల్లో 25 సీట్లలో విజయం సాధిం చిన బీజేపీ ఈసారి 14 స్థానాల్లోనే గెలిచింది. గతంతో పోలిస్తే కర్ణా టకలో విదుబీ హరియాణాలో ఐదు సీట్లు తగ్గాయి, వెరసి, కీలకమైన ఐదారు రాష్ట్రాల్లోనే దాదాపు 70 సీట్లను బీజేపీ కోల్పోయింది. మొ త్తంగా గత ఎన్నికల్లో సొంతంగా 303 సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఈసారి 65 స్థానాలు తగ్గిపోవడం గమనార్హం.గతానికి భిన్నంగా బీజేపీ ఈసారి దాదాపు వంద సీట్లలో సి టింగ్ ఎంపీలను మార్చింది. ఇతర పార్టీల నుంచి చేర్చుకుని మరీ టికెట్లు ఇచ్చింది. పార్లమెంటు ఎన్ని కల్లో విజయమే లక్ష్యంగా నాలుగు రాష్ట్రాల్లో సీఎంలనూ మార్చింది. అయినా, మేజిక్ మార్కును చేరు కోవడంలో విఫలమైంది. ఇండియా కూటమి గతంతో పోలిస్తే బలంగా పుంజుకోవడానికి ఈ ఐదారు రాష్ట్రాలతో పాటు తమిళనాడు
కారణం. ఎన్డీయేని ఆదుకున్న ఏపీ, ఎంపీ, బిహార్ ఎన్డీయే కూటమిని ఆంధ్రప్రదేశ్, బిహార్, తెలంగాణ లు(Telangana) అదుకున్నాయి. ఏపీలో కూటమి అభ్యర్థులు 18 స్థానాల్లో విజయం సాధిస్తే, బీహార్ లో బీజేపీతో కలిపి కూటమి 24 స్థానాల్లో గెలిచింది. ఈ రెండు రాష్ట్రాలే ఎన్డీయే కూటమి ఆధిక్యంలోకి రావడానికి కారణ మైంది. ఇక, మధ్యప్రదేశ్, ఢిల్లీల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయగా ఒడిసా, గుజరాత్, ఛత్తీసగఢ్, ఉత్తరాఖండ్, అసోం, జారoడ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపురల్లో బీజేపీ తన పట్టును నిల బెట్టుకుంది. తెలంగాణలో గతంతో పోలిస్తే రెట్టింపు సీట్లనుసాధించింది.ఈసారి దక్షిణాదిపై ప్రత్యేకంగా కన్నే సిన బీజేపీ తమిళనాడులో సిటింగ్ సీటును కోల్పోయినా కమ్యూనిస్టు ల కంచుకోట కేరళలో కాలుమో పింది. ఇక్కడి త్రిసూర్ లో సినీ నటుడు సురేశ్ గోపి బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అదే సమయంలో, కూటమి భాగ స్వామిగా పోటీ చేసి ఏపీలో మూ డు సీట్లు గెలిచినా కర్ణాటకలో ఎని మిది స్థానాలను కోల్పోయింది. ఇక, ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పూర్తిస్థాయిలో ఆనందపడే సంద ర్భం ఒడిసాలో అధికారంలోకి రావడం, అక్కడ ఎంపీ సీట్లలోనూ మెజారిటీ సాధించడమే కొసమెరుపు.

NDA alliance win Lok sabha elections