Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NDA alliance: ఎన్డీయే ఎవరెస్ట్ శిఖరం కూటమి ‘భారత్ ‘ ఆత్మ

దేశంలో ఎన్ డి ఏ ఎవరెస్టు శిఖరం లాంటి దని, అలాంటి కూటమి అసలైన భారత స్పూర్తిని చాటుతుందని లోక్ సభ పక్ష నేత నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

కంటిమీద కునుకులేని కష్టానికి ఫలితమే ఈ విజయం
ఆంధ్రప్రదేశ్ లో కూటమికి బ్రహ్మ రథం పట్టారు
పవన్ కల్యాణ్ ఒక పవనమే కాదని తుఫాన్ అని కితాబు
లోక్ సభ పక్ష నేతగా ఎన్నికైన సంధర్బంగా నరేంద్ర మోదీ

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో ఎన్ డి ఏ(NDA) ఎవరెస్టు శిఖరం లాంటి దని, అలాంటి కూటమి అసలైన భారత స్పూర్తిని చాటుతుందని లోక్ సభ పక్ష నేత నరేంద్ర మోదీ(Narendra Modi) పేర్కొన్నారు. తనను కూటమి పక్షనే తగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న అనం తరం మోదీ మాట్లాడారు. ఈ కూట మి30 ఏళ్లుగానడుస్తున్నదన్నారు. ఇది మామూలు విషయం కాదని ఉద్ఘాటించారు. ఇది ముమ్మాటికి భారత దేశ ఆత్మగా నిలుస్తుందన్నా రు. ఎన్నికల(Election) ముందు పొత్తు పెట్టు కున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయవంతం కాలేదన్నారు. అభి వృద్ధిలో దేశాన్ని మరింత ముం దుకు తీసుకెళ్తా మని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరి స్తున్నాని తెలి పారు. అలాగే మద్దతుగా నిలిచిన ఎన్టీయే మిత్రపక్షాలకు ధన్యవా దాలు తెలిపారు. పదేళ్ల బీజేపీ(BJP) పాలనలో మోదీ దేశానికి ఎంతో సేవ చేశారు. వివక్షాల తప్పుడు ఆరోపణలను ప్రజలు తిప్పి కొట్టారు. మోదీపైనే ప్రజలు మరోసా రి భరోసా ఉంచారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించగల సత్తా మీకే ఉన్న దీని నిరూపించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా మేమంతా అండ గా ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా మోదీ పేరును మార్మోగేలా చేశారు.

దేశానికి మోదీ స్పూర్తి యావత్ దేశానికి మీరు స్పూర్తిగా నిలిచాడు మీ దిశానిర్దేశంలో ఏపీలో 85 శాతం సీట్లు సాదించాం. కూటమిగా జట్టు కట్టి చక్కటి ఫలితాలను సాదిం చాం. ఏపీ ప్రజలు కూటమి సర్కారు పై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. రాష్ట్రానికి అండగా ఉండాలి. ఏపీ పురోగమనంలో వెళ్లేందుకు సహక రించాలి.22 రాష్ట్రాల్లో అధికారంలో ఎన్డీయే ఎన్డీయే పక్షనేతగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. రాత్రి పగలు కష్టానికి ఫలితమే ఈ విజయమని కొనియాడారు. ఎన్డీ యే అధికారంలోకి రావడం కోసం కార్యకర్తలు, శ్రేణులు ఎంతో శ్రమిం చారన్నారు. రాత్రింబవళ్ళ. కష్టపడి న లక్షలాది మంది కార్యకర్తలకు ఎన్డీయే నేతలకు ఎంత కృతజ్ఞతలు తెలిసినా తక్కువేనని చెప్పారు.

ఎన్డీయే కూటమి దేశంలో 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంద న్నారు. ఎస్టీ జనాభా ఎక్కు వగా ఉన్న 100 రాష్ట్రాల్లో 7 చోట్ల కూటమి అధికారంలో ఉందన్నారు. ఆంధ్రప్రదే శ్లో చంద్రబాబు(Chandrababu) చారిత్రక విజయం సాధించారని ప్రశంసిం చారు. ఏపీలో ఇంతటి భారీ విజ యం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. అక్కడి ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టార న్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఒక పవనం కాదని, తుఫా న్ అని ఎన్డీఏ పక్షాలు అందరికీ పరి చయం చేస్తూ ప్రశంసించారు. అరు ణాచల్, సిక్కిం, ఏపీలో క్లీన్ స్వీప్ చేశామన్నారు. 2024లో ఎన్డీ యే గొప్ప విజయం సాదించిందని కొనియాడారు.
NDA is soul of Bharath