నేడే ఎన్డీఎ ఎంపిలు భేటీ
దేశ ప్రధాని గా ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది.
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మోదీ ఎన్నిక లాంఛనం
మంత్రివర్గ ఏర్పాటు పై విస్త్రుత స్థాయిలో చర్చలు
మిత్రపక్షాలకు కేటాయించే స్థానా లపై ప్రధానంగా
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ ప్రధాని గా ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ(Narendra Modi)ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆయనను ప్రధానిగా ఎన్నుకు నేందుకు మార్గం సుగమం చేస్తూ తమ పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నుకునేందుకు బిజెపి(BJP) నేతృత్వం లోని నేషనల్ డెమోక్రటిక్ అలయె న్స్ (ఎన్డిఏ)కి చెందిన కొత్తగా ఎన్నికై న ఎంపీలందరూ శుక్రవారం సమా వేశమవుతున్నారు. ఎన్డీఎ ఎంపీల నాయకుడిగా నరేంద్ర మోడీ ఎ న్ని కైన అనంతరం కూటమిలో సీనియ ర్ నాయకులైన చంద్రబాబు, నితీష్ కుమార్ తదితరులతో కలసి రాష్ట్ర పతి ద్రౌపది ముర్మును(Draupadi Murmu)మోడీ కలసి తనకు మద్దతు ఇస్తున్న ఎంపీల జాబితాను సమర్పిస్తారని వర్గాలు తెలిపాయి. ఈ వారాంతంలో బ హుశా ఆదివారం నాడు నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వారు చెప్పా రు.
ఎన్డీఏకి 293 మంది సభ్యుల సంఖ్యా బలం ఉండగా 543 మంది సభ్యుల లోక్సభలో మెజారిటీ మా ర్కు 272 కాగా అంతకన్నా అధికం గా నే ఎన్డిఎ బలం ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పా టుకు పార్టీ సన్నా హాలు మొదలుపెట్టడంతో పార్టీ సీనియర్ నాయకులు అమిత్ షా,(Amit shah) రాజ్నాథ్ సింగ్ తదితరులు గురు వారం నాడిక్కడ సమావేశమై చ ర్చలు జరిపారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా(JP Nadda)నివాసంలో సమావే శమైన వీరు మంత్రివర్గంలో మిత్ర పక్షాల వాటా, సంకీర్ణ ప్రభుత్వంలో తమ పార్టీ నుంచి ఎవరిని చేర్చుకో వాలి వంటి అంశాలను ఈ సంర్భం గా చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి త్వ శాఖల కేటాయింపుపై కూటమిలోని భాగస్వామ్య పక్షా లతో బిజెపి సీనియర్ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు.
NDA MPs meeting today