Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NDA ruling: ఇక ఏకాభిప్రాయంతోనే ఏలిక..!

కేంద్ర ప్రభు త్వ పాలనకు సంబంధించి ఇక అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయం తోనే తీసుకునేందుకు కృషి చేస్తాన ని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించా రు.

ఎన్డీయే స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తా, 24/7 అందుబాటులో ఉంటా
కూటమికి బీజాలు వేసిన మహా నుభావుల వారసత్వానికి గర్వపడు తున్నా
సామాన్యుల జీవితాల్లో ప్రభుత్వా ల జోక్యం తగ్గించి తీరుతాం
గుజరాత్‌లో నేను, చంద్రబాబు ఏపీలో ఉన్నా మాకు పేదల సంక్షేమ మే ప్రధానం
నా పక్కన ఎన్డీయే నేతలందరిలో నూ సుపరిపాలన అనే ఒకే ఒక లక్ష ణం ఉంది
ఏపి లో పవన్‌ కేవలం పవనo కా దు ఒక తుఫాను మాదిరి
కాంగ్రెస్‌ వచ్చే పదేళ్లలో కూడా వంద మార్కు దాటదు
ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవ ఎన్ని కైన సంధర్బంగా మోదీ

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభు త్వ పాలనకు సంబంధించి ఇక అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయం తోనే తీసుకునేందుకు కృషి చేస్తాన ని ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రకటించా రు. అన్నింటికన్నా దేశం ముఖ్యం అన్న సూత్రానికి కట్టుబడి ఎన్‌డీఏ కూటమి పని చేస్తుందని చెప్పారు. శుక్రవారం ఉదయం పాత పార్ల మెంట్‌ భవనంలోని సెంట్రల్‌ హాలు లో ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ(NDA parliamentary party) నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వా త కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను ఎన్‌డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తా నని ప్రకటించారు. వాజ్‌పేయి, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, జార్జి ఫెర్నాం డెజ్‌, శరద్‌ యాదవ్‌, బాల్‌ ఠాక్రేలు వేసిన కూటమి బీజాలు ఇవాళ బల మైన వృక్షంగా మారాయని, ప్రజలు దానికి దోహదం చేశారని ఆయన చెప్పారు.

ఆ మహా నుభావుల వార సత్వం తనకు లభించినందుకు గర్వం గా ఉందన్నారు. తన పక్కన ఉన్న ఎన్డీయే నేతలందరిలోనూ ఒక సమాన లక్షణం కనపడుతోందని, అదే సుపరిపాలన అని మోదీ చె ప్పారు. తాను గుజరాత్‌లో ఉన్నా, చంద్రబాబు ఏపీలో ఉన్నా తమం దరి పాలనలో కేంద్ర బిందువు పేదల సంక్షేమమేఅన్నారు. ఎన్‌డీఏ కూటమి(NDA alliance) భారతదేశ స్ఫూర్తిని ప్రతి బింబిస్తుందని ప్రధాని మోదీ అన్నా రు. రాజ్యాంగ విలువలను కాపా డేందుకు అంకిత భావంతో పని చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. విపక్ష నేతలు చెబు తున్నట్లుగా తమనెవరూ ఓడిం చలేదని మోదీ అన్నారు. అదే సమయంలో ఓడిపోయిన వారిని అపహాస్యం చేయబోమని చెప్పా రు. తాజా ఎన్నికల తీర్పు దేశం ఎన్‌డీఏ కూటమినే విశ్వసిస్తోందనే విషయాన్ని స్పష్టం చేసిందని మోదీ వ్యాఖ్యానించారు.

గత పదేళ్ల పాల న ట్రెయిలర్‌ మాత్రమేనని తాను గతంలో చేసిన వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రసంగం కాదని, తన నిశ్చితాభిప్రాయమని మోదీ చెపా రు. పార్లమెంటులోని అన్ని పార్టీలు తమకు సమానమేనన్నారు. తన ప్రసంగంలో మోదీ ప్రతిపక్షాలపై సహజ శైలిలో చెణుకులు విసి రారు. ఇండియా కూటమి 2024 ఎన్నికలకే పరిమితమని భాగ స్వామ్య పార్టీలు చెప్పడంలోనే వాటి అధికార దాహం స్పష్టమవు తోందని విమర్శించారు. ఎన్నికలు జరుగుతుండగానే విపక్షం ఈవీఎం లపై దుష్ప్రచారం కొనసాగించిం దని, సుప్రీంకోర్టు దాకా వెళ్లారని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వారి నోళ్లు మూత పడ్డాయని మోదీ అన్నారు. ఈ వీఎంలను ప్రశ్నించే ప్రతిపక్షాలు ఈ శతాబ్దానికి చెందిన వారు కాదని తనకు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఫలానా వారికి మంత్రిపదవులు వస్తున్నాయని మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను ఎంపీలు పట్టించుకోవద్దని మోదీ పిలుపునిచ్చారు. ఇవన్నీ తప్పుడు వార్తల్లో ఆరితేరిన ఇండీ కూటమి సృష్టేనని చెప్పారు. పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా దేశంలో అతి పురా తన పార్టీ అయిన కాంగ్రెస్‌ వంద సీట్లు కూడా సాధించలేక పోయిం దని మోదీ(Modi) వ్యాఖ్యానించారు. వచ్చే పదేళ్లలో కూడా ఆ పార్టీ సీట్ల సంఖ్య వంద దాటబోదన్నారు. గత మూ డు ఎన్నికల్లో కలిపి వారికి వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు ఈ ఎన్ని కల్లో తమకు లభించాయని గుర్తు చేశారు. ఈ సారైనా ప్రతిపక్షాలు దేశ నిర్మాణానికి దోహదం చేస్తా యని, పార్లమెంట్‌ చర్చల్లో పాల్గొం టాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

పవన్‌ ఓ తుఫాను..దక్షిణ భారతదేశంలో తమ కూటమి కొత్త చరిత్రను సృష్టించిందని మోదీ వ్యా ఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ చరి త్రలోనే (Andhra Pradesh)అతి పెద్ద విజయం లభిం చిందని చంద్రబాబుతో అన్నారు. జనసేన అధినేత పవన్‌ పవనం కాదని, ఓ తుఫాను అని మోదీ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో లభిం చిన భారీ విజయం అభివృద్ధి పట్ల సామాన్య మానవుడి ఆకాంక్షలకు ప్రతిబింబం అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇటీవలే ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అనతికాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మోదీ అన్నారు. అందుకే ఎన్‌డీఏ సీట్లు రెట్టింపు అయ్యాయని వ్యా ఖ్యానించారు. కర్ణాటకలోనూ అదే పరిస్థితి ఉందన్నారు. తమిళనాడు లో సీట్లు రాకపోయినా ఓట్ల శాతం బాగా పెరిగిందని చెప్పారు. కేరళలో తరతరాలుగా వేల మంది కార్యక ర్తలు బలిదానం చేశారని, ఇవాళ పార్లమెంట్‌లో తమ ప్రతినిధి ప్రవేశిం చారని ఆయన అన్నారు. సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, పుదు చ్చేరి, ఒడిసా విజయాలనూ ఆయన ప్రస్తావించారు. ఒడిసాలో జగన్నాథుడు పేదల దేవుడని, రాష్ట్రంరానున్న రోజుల్లో అభివృ ద్ధికిచోదక శక్తిగా మారుతుందని చెప్పారు.

NDA ruling in India