–1,563 మందికి మళ్లీ నీట్ పరీక్ష పెడితే రాసింది 813 మందే
–పట్నా, గోధ్రాలో ప్రత్యేక బృందాల దర్యాప్తు
— బిహార్‌లో అరెస్టైన ముగ్గురు నిందితుల వెల్లడి
NEET:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: నీట్ (NEET) పరీక్ష లీకు వీరులు మళ్లీ పరీక్ష పెడితే ముందస్తు వ్యూహంతో ఎగొట్టారు. గ్రేస్ మార్కులు (Grace marks) ఇచ్చిన 1563 మంది కి జాతీ య టెస్టింగ్ ఏజెన్సీ (Testing agency) ఆదివారం మళ్లీ నీట్ పరీక్ష నిర్వహి స్తే వారిలో 813 (52 శాతం) మందే హాజరయ్యారు. మిగతా 750 మం దీ డుమ్మా కొట్టేశారు. మేఘాలయ, హరియాణా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, చండీగఢ్‌లోని పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించగా చండీగఢ్ (Chandigarh) కేంద్రంలో పరీక్ష రాయాల్సిన ఇద్దరూ హాజరు కాలేదు. ఛత్తీ సగఢ్ రెండు కేంద్రాల్లో 602 మంది పరీక్ష రాయ డానికి ఏర్పాట్లు చేయగా కేవలం 291 మందే వచ్చారు. హరియాణా లో రెండు కేంద్రాల్లో 494 మందికి ఏర్పాట్లు చేయగా 287 మంది, మేఘాలయలో 464 మందికిగాను 234 మంది మాత్రమే పరీక్ష రాశారు.
గుజరాత్ లో ఒకే ఒక్క అభ్యర్థి కోసం పరీక్ష పెట్టారు. మరో వైపు నీట్ కేసు (case of NEET) దర్యాప్తున చేపట్టిన సీబీఐ (cbi)ఆదివారం ఎఫ్ఆర్ నమోదు చేసింది. కేంద్ర విద్యాశాఖ ఫిర్యాదు మేరకు.. నీట్-యూజీ (NEET-UG) 2024 పరీక్ష నిర్వహణలో కొన్ని రాష్ట్రాల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్టు పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 120-బి , సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేసింది. ఇక నీట్, యూజీసీ నెట్ ప్రశ్న పత్రాలు లీక్ అయిన నేప థ్యంలో ఆ రెండింటితో పాటు జేఈఈ మెయిన్, కామన్ యూ నివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సహా పలు ప్రవేశ, పోటీ పరీక్షలు నిర్వహించే ఎన్డీఏ వెబ్సైట్ హ్యాక్ అయ్యిందన్న వదంతులు విస్తృతంగా వ్యాపి స్తున్నాయి. దీంతో ఎన్ టీఏ అప్ర మత్తమై అలాంటిదేమీ లేదని, ఎన్డీఏ, దాని అనుబంధ వెబ్సైట్లన్నీ అత్యంత భదంగా ఉన్నాయని ప్రకటించింది. మరోవైపు పరీక్షల సంస్క రణలపై ఇస్రో మాజీ చీఫ్ రాధాకృష్ణన్ (Former ISRO chief Radhakrishnan) నేత్వంలో కేంద్రం నియ మించిన ఏడుగురు సభ్యుల ప్యానెల్ సోమవారం సమావేశం కానుంది.