–సీల్డ్ కవర్‌లో నివేదిక అందజేసిన సీబీఐ
–నీట్ పేపర్ లీక్‌పై సుప్రీం ధర్మాస నం
–ఈనెల 18న పూర్తిస్థాయి విచారణకు నిర్ణయం
Neet Paper leak:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: వైద్యవిద్య కోర్సుల్లో (Medical course)ప్రవేశాల కోసం నిర్వహిం చిన నీట్ యూజీ పరీక్ష లీకేజీపై ఈ నెల 18న తుది విచారణ చేపట్టి తీర్పు వెలువరిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూ డ్ (Justice DY Chandrachud)నేతృత్వంలోని ధర్మాసనం వెల్ల డించింది. పేపర్ లీక్‌పై గురువారం కోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో సిబిఐ తన దర్యాప్తు నివేదికను ఈ సందర్భంగా సీల్డ్ కవర్‌లో అందజేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు హాజరు కాగా, ప్రభుత్వం తరఫున సొలిసిట ర్ జనరల్ హాజరుకాలేదు.
పేపర్ లీక్ (paper leak) ఏదొక ప్రాంతానికి పరిమితమైం దని, ప్రశ్నపత్రాలు ఆన్‌లైన్‌లో అంద రికీ చేరాయా, లీక్ వల్ల ఎంతమంది బెన్‌ఫిట్ అయ్యారు స్కామ్‌తో సం బంధం లేని విద్యార్థులను వేరు చేసే అవకాశాలున్నాయా లీకేజీ (leak) రెండు రాష్ట్రాలకే పరిమితమైందా అని సీజేఐ(cji) ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష లు రాశారని, వీరందరి భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు. అయితే కేంద్రం, ఎన్టీఏ తరఫున అఫిడవిట్లు అందజే యలేదు. అవి అందాకనే వాదనలు విని పూర్తిస్థాయి విచారణ చేపట్టి తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేసింది. అనంతరం తుది విచార ణను ఈనెల 18కి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం.