Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kavitha liquor case: కవిత కేసులో కొత్త మలుపు

దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

కవితపై ఈడి అనుబంధ ఛార్జిషీట్‌ పై కోర్టు కీలక నిర్ణయం

జూన్ 3వ తేదీన ఛార్జిషీట్ లోని నిందితులందరూ కోర్టు ఎదుట హాజరు కావాలంటూ సమన్లు జారీ

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం(Liquor scam)కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో భాగంగా అరెస్టయి తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(Kalvakuntla Kavitha) మరో ఎదు రుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఈ కేసులో కవితపై(Kavitha) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌పై రౌస్ ఎవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కవితపై దాఖలైన ఛార్జిషీట్‌ను రౌస్ ఎవె న్యూ కోర్టు పరిగణలోకి తీసుకోవట మే కాకుండా జూన్ 3వ తేదీన ఛార్జిషీట్లో పేర్కొన్న నిందితులందరూ కోర్టు ఎదుట హాజరు కావా లంటూ సమన్లు జారీ చేసింది. దీంతో వచ్చే నెల 3న కవితను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టను న్నారు.

కవిత విచారణకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని ఈడీ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవే జా(Kaveri Bave Ja)ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. తాజాగా గురువారం ఈడీ ఛార్జి షీట్‌ను పరిగణలోకి తీసుకుంటు న్నట్లు ప్రకటించారు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై నిన్న (మే 28న) ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపుల వాద నలు విన్న హైకోర్డు జడ్జి స్వర్ణకాంత శర్మ(Swarnakanta Sharma)తీర్పును రిజర్వు చేశారు.ఈ క్రమంలో రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకుని ఇందులో నిందితులుగా ఉన్న వారందరిని విచారణకు పిలవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. జూన్ 3న ఏం జరగ నుందన్నది అనేది ఉత్కంఠగా మారింది.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. కవిత బెయిల్‌ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో మంగళవారం ఈడీ అధికారులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఈడీ సంచలన విషయాలు వెల్లడించింది . ఈ మద్యం వ్యాపారం గురించి కేసీఆర్‌కు(KCR).. కల్వకుంట్ల కవిత ముందే వివరాలు చెప్పినట్టుగా కోర్టుకు తెలిపింది. కవిత తన టీమ్‌ సభ్యులైన బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ పిళ్లైలను.. ఢిల్లీలో కేసీఆర్‌కు పరిచయం చేశారని కూడా పేర్కొన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు సమీర్‌ మహేంద్రును బుచ్చిబాబు పరిచయం చేసినట్లు తెలిపింది. సమీర్ మహేంద్రను అడిగి ఢిల్లీ మద్యం వ్యాపారం వివరాలను కేసీఆర్‌ తెలుసుకున్నారని ఈడీ వివరించింది.

New twist in Kavitha liquor case