Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Oil Rates Hike: సామాన్య గృహిణులకు బిగ్ షాక్

–వంట నూనెలు ఆకాశాన్నంటే అవకాశాలు

Oil Rates Hike: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: గృహిణుల (house wives)కు గుండె నొప్పి వచ్చేంత పని అయ్యింది. దీంతో సామాన్యులకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయి. అయితే ముడిచమురు (crude), శుద్ధి చేసిన ఎడిబుల్‌ ఆయిల్‌ (refined edible oil)పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని భారత ప్రభుత్వం ఏకంగా 20 శాతం పెంచింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడిబుల్ ఆయిల్ (edible oil) దిగుమతి దారులు, తక్కువ నూనె గింజల ధరలతో పోరాడుతున్న రైతులకు సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరగనున్నాయి. ఫలితంగా పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ ఫ్లవర్ ఆయిల్ విదేశీ కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంది.

 

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ముడి, శుద్ధిచేసిన పామాయిల్‌, సన్‌ఫ్లవర్‌ నూనెపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచడమే ఇందుకు కారణం. ముడి సన్‌ఫ్లవర్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని 20 శాతానికి, శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని 32.5 శాతానికి పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముడి పామాయిల్‌, సోయా బీన్‌, సన్‌ఫ్లవర్‌ సీడ్‌ ఆయిల్‌ (palm oil, soybean oil and sunflower Oils)పై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకం సున్నా నుంచి 20 శాతానికి పెరిగింది.

 

అలాగే శుద్ధి చేసిన పామాయిల్‌, సోయాబీ న్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై బేసిక్‌ కస్ట మ్స్‌ సుంకం 12.5 నుంచి 32.5 శాతానికి ఎగబాకింది. ఈమేరకు మొత్తం సుంకం ముడి నూనెలపై 5.5 శాతం నుంచి 27.5 శాతానికి, రిఫైన్డ్‌ ఆయిల్స్‌పై 13.75 శాతం నుంచి 35.75 శాతానికి పెరగనుంది. శనివారం నుంచి సుంకాల్లో మార్పు అమల్లోకి రానుంది. దిగుమతి సుంకం పెరగడం వల్ల దేశీయంగా వంట నూనెల ధరలు పెరగనున్నాయి. ధరల పెరుగుదల వినియోగాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది.

 

సుంకాల పెంపు నేపథ్యంలో విదేశాల నుంచి పామ్‌ ఆయిల్‌, సోయా, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. భారత్‌ తన వెజిటేబుల్‌ ఆయిల్స్‌ డిమాండ్‌ను 70 శాతానికి పైగా దిగుమతుల ద్వా రానే తీర్చుకుంటోంది. ఇండోనేషియా, మలేసియా, థాయిలాండ్‌ నుంచి పామ్‌ ఆయిల్‌ను మన దేశం కొనుగోలు చేస్తోంది. సోయా ఆయిల్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను అర్జెంటీనా, బ్రెజిల్‌, రష్యా, ఉక్రె యిన్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది.