OilSeeds : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ : మన అస వరాలు తీరేలా, మనకు ఆహారాన్ని సమకూర్చేలా దేశీయ వ్యవసాయ విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. వాణిజ్య పంటల ను సాగు చేసే రైతులను భారీగా ప్రోత్సహించాలి. వాణిజ్య పంటల సాగుద్వారా లభించిన ఆదాయా న్ని ఆ కుటుంబాలకు చెందేలా చేస్తే వారికి పంటల సాగుపై ఆసక్తితో పాటు ఆదాయం కూడా వస్తుంది. ప్రధానంగా వంటనూనె గింజల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు పెంచాలి. ఇందులో నువ్వులు, వేరుశనగ, కొబ్బరి, కుసుమలు, పొద్దుతిరు గుడు ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు ఇస్తే..రైతులు కూడా లాభపడ తారు. దేశీయంగా వంటనూనెల ఉత్పత్తి పెరుగుతుంది.
అలాగే విదేశాల నుంచి నూనెల దిగుమతి చేసుకోవాల్సన ఖర్మ ఉండదదు. ఇంధనం, వంటనూనెలపై మనం విదేశాలపై ఆధారపడకుండా సొంతంగా ఉత్పత్తి చేసుకునే అవకాశాలను పాలకులు పరిశీలించడం లేదు. కనీసం వంటనూనెలకు అసవరమైన వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు, కుసుమలను పండిరచి దేశానికి అసవరమైన ఉత్పత్తులు స్వయం సమృద్ధి సాధించాలన్న సంకల్పం పాలకుల్లో కనిపించడం లేదు. అసలు ఇలాంటి ఆలోచన పాలకుల్లో ఉన్నట్లుగా కూడా గోచరించడం లేదు. ఈ క్రమంలో మనం విదేశాలపై ఆధారపడడం, విపరీతంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయడం జరుగుతోంది. దీంతో మన సంపాదన అంతా విదేశాలకు తగులబెట్టాల్సి వస్తోంది. వాణిజ్య పంటల సాగు ఇప్పటి వరకు రైతులకు ఆర్థికంగా పెద్దగా దోహదం చేయడం లేదు. ప్రధానంగా వంటనూనెలను దేశీయంగా తయారు చేసుకోవాలి. అలాగే వంటనూనెల ఉత్పత్తికి అసవరమైన నూనెగింజల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ విధానంపై ఓ గట్టి నిర్ణయం తీసుకుని మనం వంటనూనెల కోసం విదేశాలపై ఆధారపడకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. దీంతో అటు రైతులకు కూడా మేలు జరుగుతుంది. చౌడు నేలలను ప్రత్యామ్నాయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటలు మనకు మరింత ప్రయోజనకరంగా ఉండేలా పాలకులు ఆలోచనలుచేయాలి. ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడంలో భాగంగా మనకున్న సారవంతమైన నేలలను, నదీజలాలను ఉపయోగించి మన పంటల విధానంలో మార్పులు తీసుకుని రావాలి.వరి, గోధుమ పంటల సాగు ఎండుగడ్డిని సమకూరుస్తుంది. ఇదే పశువులకు ముఖ్య ఆహారం. దీనివల్ల పాల ఉత్పత్తి పెరిగి బాలలకు పోషకాహారం సమృద్ధిగా లభించేందుకు దోహదం జరుగుతోంది. పాడిని, మాంసం కోసం కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకాన్ని కూడా పెంచుకునేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాల్సి ఉంది.