— డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం
Donald Trump: ప్రజా దీవెన, అమెరికా: డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై మరోసారి హత్యాయత్నం (Murder Attempt) జరిగింది. గోల్ఫ్ ఆడుతుండగా ట్రంప్ టార్గెట్‌గా కాల్పులు జరి పారు. పక్కనే పొదల్లో నుంచి దుండగుడు ఏకే 47 (AK 47)తో కాల్పులు జరిపి హత్యాప్రయత్నం చేశారు.
వెంటనే తేరుకున్న సీక్రెట్ ఏజెంట్లు (Secret Agents) దుండగుడిపై ఎదురు కాల్పులు జరిపగా కాల్పుల తర్వాత వాహనంలో నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న అమెరికా పోలీసులు (America Police) నిందితుడిని ఛేజ్ చేసి పట్టుకున్నారు. కాల్పులు జరిపింది 58 ఏళ్ల ర్యాన్ రౌత్‌గా గుర్తించారు. ఆ తరవాత డొనాల్డ్ ట్రంప్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఫ్లోరిడా (Florida)రాష్ట్రంలోని పామ్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది.