–నేటి నుంచి రెండు రోజుల పాటు పోలెండ్ పర్యటనకు ప్రధాని మోదీ
–అ తర్వాత ఉక్రెయిన్ లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో చర్చలు
–ఈ పర్యటనతో 45 ఏళ్ల తర్వాత పోలాండ్ లో పర్యటించనున్న తొలి భారత ప్రధానిగా రికార్డు
Pm Modi: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల సర్దుబాటుతో పాటు మరింత మెరుగైన సత్సంబంధాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi)రెండు రోజుల పర్యటన కోసం పోలాండ్ దేశం బయలుదేరారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చు కోవడమే ఈ పర్యటన ఉద్దేశమని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ప ర్యటనతో ప్రధాని మరో రికార్డును సృష్టించారు. 45 ఏళ్ల తర్వాత పో లాండ్ లో పర్యటించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలవను న్నారు. చివరిసారి 1979లో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్ లో పర్యటించడం గమ నార్హం. ఆ తర్వాత ఇప్పటి వరకూ భారత ప్రధానులు ఎవరూ కూడా ఆ దేశానికి వెళ్లలేదు.
ఈ పర్యటన లో వివిధ కీలక అంశాలలో భాగ స్వామ్యం, రక్షణ రంగంలో (Part ownership, defense sector) పరస్పర సహకారం తదితర అంశాలపై పో లాండ్ అధ్యక్షుడితో మోదీ చర్చిం చనున్నారని తెలిపింది.ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో భారత విద్యార్థులకు పోలాండ్ సాయం చే సింది. ఉక్రెయిన్ నుంచి సుమారు 4 వేల మంది భారత విద్యార్థులు పో లాండ్ లోకి అడుగుపెట్టి, అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. అదేవి ధంగా, రెండో ప్రపంచ యుద్ధ సమ యంలో దాదాపు 6 వేల మంది పోలిష్ మహిళలు, చిన్నారులకు భారత భూభాగంలో ఆశ్రయం కల్పించారు. కాగా, పోలాండ్ పర్యటన (A trip to Poland) ముగించుకుని ఈ నెల 23న ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు వెళ్లనున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆ దేశ ప్రెసిడెంట్ వొలొది మిర్ జెలెన్ స్కీ తో చర్చలు జరప నున్నారు.
ఉక్రెయిన్‌లో శాంతి అకాంక్షిస్తు న్నా ఈ పర్యటనకు ముందు ప్రధా ని మోదీ (Pm Modi) ఓ ప్రకటనను విడుదల చే శారు. ఉక్రెయిన్‌లో శాంతి, స్థిర త్వం త్వరగా తిరిగి రావాలని ఆ కాంక్షిస్తు న్నట్లు పేర్కొన్నారు. ”మధ్య ఐరోపా లో భారత్‌కు పోలండ్ కీలక ఆర్థిక భాగస్వామిగా ఉంది. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో నా భేటీ కోసం ఎదురుచూస్తున్నా. అక్కడి భార తీయులతోనూ ముచ్చటించను న్నారు. ఆ పర్యటనను ముగించు కొని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదమిర్ జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు కీవ్ వెళ్లనున్నా. ఆ దేశంలో భారత ప్రధాని చేపట్టబోయే తొలి పర్యటన ఇదే కానుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ప్రధానాంశంగా ఈ పర్య టన సాగనుంది. గత రెండేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ వివాదా నికి శాంతియుత పరిష్కారంపై జెలె న్‌స్కీతో నా ఆలోచనలు పంచుకొనే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. అక్కడ శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నానని మోదీ (Pm Modi) ఆ ప్రకటనలో పేర్కొన్నారు.