POK: పీఓకే పై భారత్ దే
జమ్మూ కశ్మీర్‌లో గతంలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారడానికి కొందరు విపక్ష నేతలే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు
సార్వభౌమాధికారo
పిఓకే భారత్ లో భాగo, వెనక్కి తెచ్చుకొని తీరుతా0
మోదీ నాయకత్వంలో కశ్మీర్‌లో గణనీయమైన మార్పులు
మణి శంకర్ అయ్యర్, ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలు ప్రజలను భయపెట్టారు
పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ప్రజా దీవెన, కోల్ కత్తా: జమ్మూ కశ్మీర్‌లో(Jammu kashmir) గతంలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారడానికి కొందరు విపక్ష నేతలే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. అదే సందర్భంలో మోదీ నాయకత్వంలోనే కశ్మీర్‌లో గణనీ యమైన మార్పులు చోటు చేసుకు న్నాయని కొనియాడారు. పాక్ ఆక్ర మిత కశ్మీర్(POK) పై భారతదేశం సార్వ భౌమాధికారాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit shah) మరోసారి విస్పష్టంగా ప్రకటించారు. పీఓకే ఇండియాకు చెందినదని, దానిని వెనక్కి తెచ్చు కుంటామని వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్ లోని సెరంపోర్‌లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో విపక్షాల తీరును ఆయన ఎండగట్టారు.
కశ్మీర్‌లో ఒకప్పుడు నిత్యం ఆజాదీ నినాదా లు, రాళ్లు రువ్వుకోవడం ఉండేవని, ఇప్పుడు అవన్నీ పాక్ ఆక్రమిత కశ్మీ ర్‌లో చోటుచేసుకుంటున్నాయని అన్నారు. రాహుల్ బాబా, మమతా దీదీకి భయం ఉంటే, భయపడనీ యండి. పీఓకే మాత్రం ఇండియాదే దానిని వెనక్కి తెచ్చుకొని తీరుతా మంటూ అమిత్‌షా స్పష్టం చేశారు. మణి శంకర్ అయ్యర్, ఫరూక్ అబ్దు ల్లా వంటి నేతలు పాకిస్థాన్-పీఓకేపై చర్చలను నిర్లక్ష్యం చేస్తూ పాక్ వద్ద అణుబాంబు ఉందంటూ వ్యాఖ్యలు చేయడం వెనక దేశప్రజల్లో భయ బ్రాంతులకు గురి చేయడమేనని అమిత్‌షా తప్పుపుట్టారు. 2.11 కోట్ల టూరిస్టులు(Tourist)కాశ్మీర్ వచ్చి సరి కొత్త రికార్డు సృష్టిస్తే, పీఓకేలో రొట్టెల పిండి ధర రికార్డు సృష్టిస్తోందన్నారు.
ప్రతి పేదవానికి మోదీ ప్రభుత్వం 5 కిలోల ఉచిత బియ్యం(Free Rice) ఇస్తోందన్నా రు. మమతా బెనర్జీ మాత్రంబియ్యం పంపిణీ ప్రక్రియను పక్కదారి పట్టి స్తున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం బియ్యం పంపుతుంటే మమతా బెనర్జీ(Mamatha benerjee) దానిపైన తన ఫోటోని ప్రదర్శిస్తూ, సంక్షేమాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. మా,మాటి, మనుష్’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన దీదీ ఇప్పుడు ఆ నినాదాన్ని ముల్లా, మౌల్వి, మదరసాగా మార్చారని ఎద్దేవా చేశారు. దుర్గా నిమజ్జనానికి ఆమె అనుమతి నిరాకరించి, రంజా న్ పండుగకు మాత్రం ముస్లింలకు సెలవులు మంజూరు చేస్తున్నారని విమర్శించారు.
POK belongs to india