–ఓ పోలీస్ అధికారికి ఊహించని షాక్
police suspension: ప్రజాదీవె, లక్నో: వివాహేతర సంబంధం పెట్టుకున్న (Having an extramarital affair)ఓ పోలీసు ఉన్నతాధికారికి ఊహించని షాక్ తగిలింది. పది మందికి మంచి చెప్పి సరైన మార్గంలో నడిపించాల్సిన పోలీస్ ఉన్నతాధికారే, ఓ మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ పోలీస్ అధికారి అక్రమ బాగోతంపై సమగ్రంగా విచారణ జరిపిన ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ డీఎస్పీని కానిస్టేబుల్‌గా డిమోషన్ (Demotion)చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.
అసలేం జరిగిదంటే
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన కృపా శంకర్ కనౌజియా కానిస్టేబుల్ (Krupa Shankar Kanaujia Constable) స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ డీఎస్పీ (dsp)అయ్యారు. చాలా కింది స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన కనౌజియా బుద్ధి డీఎస్పీగా మారిన తర్వాత తప్పుదారి పట్టింది. ఓ మహిళా కానిస్టేబుల్‌తో కనౌజియా వివాహేతర సంబంధం పెట్టుకుని మూడేళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. కనౌజియా, మహిళా కానిస్టేబుల్ ఇద్దరూ 2021లో కాన్పుర్‌లోని ఒక హోటల్‌కు వెళ్లారు. కనౌజియా భార్య ఫోన్ చేయగా, ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. కృపా శంకర్ ఆచూకీ తెలవకపోవడం వల్ల ఆందోళనకు గురైన కనౌజియా భార్య, అనుమానంతో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగం కనౌజియా నిఘా పెంచింది.
2021లోనే సస్పెండ్
ఆ సమయంలో ఉన్నావ్ సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కృపా శంకర్, వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్నాడు. ఇంటికి బదులుగా మహిళ కానిస్టేబుల్‌తో (lady constable) కలిసి కాన్పూర్‌లోని హోటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే నిఘా పెంచిన పోలీసులు, కనౌజియా కాన్పుర్‌లోని ఓ హోట్‌ల్‌లో మహిళా కానిస్టేబుల్‌తో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగా హోటల్లో కృపా శంకర్ కనౌజియా, మహిళా కానిస్టేబుల్‌తో కలిసి రెడ్ హ్యాండెడ్‌గా కనిపించారు. ఈ ఘటనతో 2021లో డీజీపీ కనౌజియాను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. మహిళా కానిస్టేబుల్‌ను కూడా సస్పెండ్ (suspend)చేశారు. విచారణ అనంతరం డీఎస్పీ కనౌజియాను కానిస్టేబుల్‌గా డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నావ్‌లోని బిఘపూర్‌లో డిప్యూటీ ఎస్పీగా ఉన్న కనౌజియా ప్రస్తుతం కానిస్టేబుల్‌గా మారారు. ప్రస్తుతం 26 బెటాలియన్ కార్ప్స్‌లో శంకర్‌కు కానిస్టేబుల్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ చర్యతో సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు (Uttar Pradesh Police)విభాగం బుద్ధి చెప్పిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.