Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Prime Minister Modi : దాయాది పై దయాదాక్షిన్యాలొద్దు

–పాకిస్తాన్ సింధు జలాల ఒప్పం దం అమలు నిలిపివేత

–వాఘా, అట్టారీ సరిహద్దు చెక్‌ పోస్ట్‌ తక్షణ మూసివేత

–సార్క్‌ వీసాలపై వచ్చినవారి వీసాలు తక్షణమే రద్దు

–ఆ వీసాలపై వచ్చిన పాకిస్థానీలు 48 గంటల్లోగా వెళ్లిపోవాలి

–ప్రధాని మోదీ నేతృత్వంలో సీసీ ఎస్‌ భేటీలో అత్యంత కఠిన నిర్ణ యాలు

Prime Minister Modi : ప్రజా దీవెన, న్యూఢిల్లీ : ఉగ్రవాదు లు పహల్గాంలో దాడి చేసి 26 మం ది పర్యాటకుల ప్రాణాలను పొట్ట నపెట్టుకోవడాన్ని తీవ్రంగా పరిగ ణించిన భారత ప్రభుత్వం ఆ దాడి వెనుక ఉన్న దాయాది దేశం పాక్‌ తో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌ దాహార్తిని తీర్చే సింధు జలాల ఒ ప్పందం రద్దు, వాఘా–అట్టారీ సరి హద్దు మూసివేత, పాక్‌ జాతీ యు లకు భారత్‌లోకి ప్రవేశాన్ని నిషేధిం చడం వంటివి అందులో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో బుధవారం సా యంత్రం సమావేశమైన ‘భద్రతపై క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌)’ ఉగ్ర దాడిని తీవ్రపదజాలంతో ఖండిం చింది. ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తె లిపింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప హల్గాంలో పర్యటించివచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అక్కడి పరిస్థితి గురించి భేటీలో వివరించా రు. ఈ దాడికి పాల్పడినవారిని, అందుకు ప్రేరేపించినవారిని తీవ్రం గా శిక్షించేంతవరకూ విశ్రమించకూ డదని సమావేశం నిర్ణయించింది.

ఈ క్రమంలో పూర్తిస్థాయిలో అప్ర మత్తంగా ఉండాలని త్రివిధ దళాల కు సూచించింది. కాగా పహల్గాం ఉ గ్రదాడిపై గురువారం అఖిలపక్ష స మావేశం నిర్వహించాలని కూడా ఈ భేటీలో నిర్ణయించారు. సీసీఎస్‌ సమావేశం ముగిసిన అనంతరం అందులో తీసుకున్న కీలక నిర్ణయా ల గురించి విదేశాంగ శాఖ కార్యద ర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాకు వెల్ల డించారు.

ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో కుదుర్చుకున్న సింధు జ లాల ఒప్పందం అమలు నిలిపి వేత నిర్ణయంతో సింధు, దాని ఉప నదులైన జీలమ్‌, చీనాబ్‌, రావి, బి యాస్‌, సట్లెజ్‌ నుంచి పాకిస్థాన్‌కు నీటి సరఫరాను ఆపేస్తారు. సీమాం తర ఉగ్రవాదానికి మద్దతును పాక్‌ విశ్వసనీయంగా, కచ్చితంగా నిలిపి వేసేదాకా ఈ ఒప్పందం అమలు కా దని భారత్‌ ప్రకటించింది. వాఘా అట్టారీ వద్ద ఏర్పాటు చేసిన ఇంటి గ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ తక్షణ మూసివేత. సరైన పత్రాలతో ఆ దారి గుండా ఇ ప్పటికే భారత్‌లోకి ప్రవేశించినవా రు మే1లోపు అదే మార్గంలో వెళ్లి పోవాలని ఆదేశించింది.

సార్క్‌ వీసా మినహాయింపు పథకం కింద పాక్‌ జాతీయులకు భారత్‌లో కి ప్రవేశం నిషిద్ధం విధించింది. ఇప్ప టికే అలా వచ్చినవారి వీసాలు రద్ద యిపోతాయి. ఈ మినహాయింపు కింద భారత్‌లో ఉన్న పాక్‌ జాతీ యులందరూ 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. న్యాయమూర్తులు, చట్టసభల స భ్యులు, సీనియర్‌ అధికారులు, వా ణిజ్య ప్రముఖులు, పాత్రికేయులు, క్రీడా ప్రముఖులు ఇలా 24 కేటగిరీ లకు చెందిన ప్రముఖులు సార్క్‌ దే శాల మధ్య వీసా రహిత ప్రయాణం చేసేందుకు వీలుగా 1992లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కిం ద ఆయా కేటగిరీలకు చెందిన ప్ర ముఖులకు వారి వారి దేశాలు ఏ డాది వ్యాలిడిటీ ఉన్న ప్రత్యేక వీసా స్టికర్‌ ఇస్తాయి. ఆ స్టికర్‌ ఉంటే సా ర్క్‌ దేశాలకు వారు సంప్రదాయ వీ సా లేకుండానే ఎన్నిసార్లయినా రా వొచ్చు, పోవచ్చు. పాకిస్థానీ హైకమి షన్‌లో ఉన్న రక్షణ, సైనిక, నౌకా ద ళ, వైమానిక దళ సలహాదారు లం దరినీ అవాంఛిత వ్యక్తులుగా పర్సొ నా నాన్‌ గ్రేటా ప్రకటించింది.

వారం రోజుల్లోగా వారంతా తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదే శించింది. అలాగే ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్‌లోని రక్ష ణ, సైనిక, నౌకా దళ, వైమానిక దళ సలహాదారులందరినీ భారత్‌ ఉప సంహరించుకుంది. ఆ పోస్టులన్నీ రద్దు చేసింది. రెండు దేశాల్లోని హైక మిషన్లలో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించింది. మే 1 నుం చి ఈ నిర్ణయం అమలు కానుంది.