Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Prime Minister Modi: ఆందోళనకరంగా సంక్షోభాలు..!

–పశ్చిమాసియాలో సంక్షోభాల కొనసాగింపు బాధాకరం
–యుద్ధక్షేత్రంలో సమస్యకు పరిష్కా రం లభించదనేది సుస్పష్టం
–పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ తో భేటీలో ప్రధాన మంత్రి మోదీ

Prime Minister Modi: ప్రజా దీవెన ఉక్రెయిన్: ఉక్రెయిన్ తో పాటు పశ్చిమాసియాలో కొనసా గుతున్న సంక్షోభాలు తీవ్ర ఆందో ళనకరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi) పేర్కొన్నారు. యుద్ధక్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన.. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఈ ప్రాంతాల్లో సాధ్యమై నంత త్వరగా శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు తాము మద్దతు తెలుపుతామన్నారు. పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ (Donald Tusk) తో భేటీ అయిన తర్వాత మీడియాకు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలోఈ విషయాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో (Ukraine, in Western Asia) కొనసాగుతున్న యుద్దాలు మనందరికీ తీవ్ర ఆందోళనకరం. యుద్ధక్షేత్రంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకదని భారత్ బలంగా విశ్వసిస్తుంది. ఏ సంక్షోభంలోనైనా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం యావత్ మానవాళికే అతి పెద్ద సవాల్. చర్చలు, దౌత్యంతోనే శాంతి, స్థిరత్వానికి మేం మద్దతిస్తాం. ఇందుకోసం మిత్రదేశాలతో కలిసి అన్నిరకాల మద్దతు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది’ అని ప్రధాని మోదీ (Prime Minister Modi) పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలండ్ వెళ్లిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించామని.. ఇరుదేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. రష్యా దండయాత్ర సమయంలో భారత విద్యార్థుల తరలింపునకు పోలండ్ ఎంతో సహకరించిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అంతకుముందు అక్కడి ప్రధానమంత్రి కార్యాలయం ‘ఛాన్స్లరీ’లో ప్రధాని మోదీకి (Prime Minister Modi) ఘనస్వాగతం లభించింది. ‘భారత్- పోలండ్ భాగస్వామ్యంలో సరికొత్త మైలురాయి. వార్సాలోని ఫెడరల్ ఛాన్స్లరీలో భారత ప్రధానికి పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ (Donald Tusk) ఘనస్వాగతం పలికారు. 45 ఏళ్ల అనంతరం భారత ప్రధాని పోలండ్లో లో చేపట్టిన ఈ పర్యటన ఇరుదేశాల భాగస్వామ్యానికి సరికొత్త ఊపునిస్తుంది’ అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. ఈ విషయంపై పోలండ్ ప్రధాని టస్క్ స్పందిస్తూ.. ‘ చివరకు, 45ఏళ్ల అనంతరం.. భారత ప్రధానిని వార్సాలో చూడటం సంతోషంగా ఉంది’ అని ఎక్స్లో (twitter) పోస్టు చేశారు. భేటీలో భాగంగా పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. ఆ తర్వాత పోలండ్ అధ్యక్షుడు ఆంద్రెజ్ సెబాస్టియన్ దుడాతోనూ మోదీ భేటీ కానున్నారు. ప్రధాని మోదీ పోలండ్ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్.. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి రాడోస్లావ్ సికోర్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ సంక్షోభం, ఇండో-పసిఫిక్ లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించినట్లు ఎస్.జైశంకర్ పేర్కొన్నారు.