NDA Govt: సమస్త జన జీవితం సుఖమయo
కేంద్రoలో ముచ్చటగా మూడోసారి బాధ్యత లు చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం తన పనితీరుకు మరింత పదును పెడు తోంది. ఎన్నికల ముందు మ్యాని ఫెస్టోలో ప్రకటించిన విధంగా హామీల అమలుకు రంగ సిద్ధం చేస్తోంది.
ప్రతి పౌరుడికి మెరుగైన జీవితమే ధ్యేయం
ప్రధాన మంత్రి కిసాన్ పై ప్రధాని తొలి సంతకం
రైతు సంక్షేమానికే మా మొదటి ప్రాధాన్యం
రాబోయే ఐదేళ్లు ఎన్డీయే ప్రత్యేక దృష్టిలో వ్యవసాయం
నిరంతర విద్యార్థిగా కొనసాగడమే మా విజయ రహస్యం
రాష్ట్రాలకు రూ.1.40 లక్షల కోట్లు విడుదల, తెలంగాణకు రూ.2,900 కోట్లు
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్రoలో ముచ్చటగా మూడోసారి బాధ్యత లు చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం (NDA Govt)తన పనితీరుకు మరింత పదును పెడు తోంది. ఎన్నికల ముందు మ్యాని ఫెస్టోలో ప్రకటించిన విధంగా హామీల అమలుకు రంగ సిద్ధం చేస్తోంది. ఆ క్రమంలోనే భారీ స్ధాయి లో ఇళ్ల నిర్మాణానికి ఎన్డీయే సార థ్యంలోని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మూడో విడత ప్రభు త్వం కొలువుదీరిన తర్వాత సోమ వారం ప్రధాని మోదీ నివాసం లో మొదటిసారిగా సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(Pradhan Mantri Awas Yojana) కింద గ్రామీణ, పట్ట ణ పేదలకు మూడు కోట్ల ఇళ్ల నిర్మా ణానికి సంబంధించిన ప్రణాళి కను ఆమోదించింది. కోట్లాదిమంది గృ హావసరాలను తీర్చేందుకు పీఎం ఏవై దోహదం చేస్తుందని, పథకం విస్తరణ, సమ్మిళిత వృద్ధి, సంక్షేమం పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను చా టుతుందని మోదీ ట్వీట్(Modi tweet) చేశారు.
దేశంలో ప్రతి పౌరుడు మెరుగైన జీవితం పొందేలా చూడడమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఇంటి నిర్మాణానికి అర్హులైన కుటుం బాల సంఖ్య పెరిగిందని, అందుకు తగినట్లుగా సాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడిస్తున్నారు. పదేళ్లలో పీఎంఏవై(PMAY) కింద 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది. కాగా, లోక్ కల్యాణ్ మార్గ్–7లోని నివాసంలో జరిగిన సమావేశంలో మోదీ మొ త్తం క్యాబినెట్ మంత్రుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఒక్కొ క్కరి నేపథ్యాలను తెలుసుకున్నా రు. 18వ లోక్‌సభ ఏర్పాటు చేయ వలసిందిగా రాష్ట్రపతి ద్రౌపది ము ర్మును అభ్యర్థించాలని నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఐదేళ్లలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ఉద్ఘా టించారు.
ప్రధానిగా సోమవారం బాధ్యతలను స్వీకరించాక 17వ విడత ‘పీఎం కిసాన్’ నిధుల విడుద లకు సంబంధించిన ఫైలుపై సంత కం చేసి విధులను ప్రారంభించారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల మేర ఆర్థిక సా యం అందనుంది. తన కార్యాల యం ప్రజలకు కేంద్రంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. మోదీ కేంద్రీ కృతంగా ఉండకూడదని సూచిం చారు. 2014కు ముందు పీఎంవో కార్యాలయం అధికార కేంద్రంగా ఉండేదని వ్యాఖ్యానించారు. దేశమే ప్రథమమని, అదే తన లక్ష్యమని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. నా జీవి తంలో ప్రతిక్షణం దేశం కోసమేనని మోదీ పునరుద్ఘాటించారు. అధికా రం కోసమో, పదవి కోసమో తాను రాలేదని స్పష్టం చేస్తూ 140 కోట్ల మంది ప్రజలు తనకు పరమాత్మతో సమానమని, అభివృద్థికి పీఎంవో ఉద్యోగులు వారధి అని, దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిదేనని పేర్కొన్నారు.
పీఎంవోపై దేశమంతా ఎంతో నమ్మ కంతో ఉందని, రాబోయే ఐదేళ్లు వికసిత్ భారత్ కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేయాలని మోదీ సూచించారు. మనం సమయం చూసుకొని, కాలానికి కట్టుబడి పని చేసే వ్యక్తులం కాదని, మన ఆలోచ నలకు పరిమితి లేదని, ఎటువంటి పరిమితులు లేకుండా పని చేసేవారే నా జట్టని, అటువంటి ఆలోచనలు ఉన్న వారినే ఈ దేశం విశ్వసిస్తుంద ని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యా నించారు. ప్రపంచంతో పోటీపడు తూ ముందుకెళ్లాలని, ఏ దేశం అం దుకోలేనంత ఎత్తుకు భారత్‌ను తీసుకెళ్లాలని చెప్పారు. గత పదే ళ్లలో చేసిన దానికంటే, ఈ ఐదేళ్లలో మరింత ఎక్కువ చేయాల్సిన బాధ్య త తనపై ఉందన్నారు. దేశంలో చాలామంది నా విజయ రహస్యం ఏమిటని అడుగుతుంటారని, నిత్య విద్యార్థిగా ఉండటమే ఆ రహస్య మని మోదీ వివరించారు.
Prime Minister’s first signature on Kisan