Rahul Gandhi: లోక్ సభ లో… ప్రతిపక్ష నేతగా రాహుల్
లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీ డబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానం
సమావేశానికి హాజరైన సీఎం రేవంత్, వంశీచంద్ రెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు సీనియర్లు
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీని(Rahul Gandhi) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీ డబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాహుల్ ను తమ నేతగా ఎన్ను కుంటూ సిడబ్ల్యుసి సమావేశం తీర్మానించింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal)వెల్లడించారు. ఢిల్లీలో శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న నేతలంతా రాహుల్ గాంధీకి ఏక గ్రీవంగా మద్దతు ఇచ్చారని తెలిపా రు. ఈ సమావేశంలో చర్చించిన వివరాలను కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ మీడియాకు వివరించారు.
సార్వత్రిక ఎన్నికల క్యాంపెయినింగ్(General Election Campaigning)లో భాగంగా నిరుద్యోగం, ధరల పెరుగుదల, అగ్నివీర్, మహిళ సమ స్యలు, సామాజిక న్యాయం వంటి అనేక అంశాలపై కాంగ్రెస్ పార్టీ సమ స్యలను లేవనెత్తిందని ఈ సమస్య లను ప్రభుత్వం పరిష్కరించేలా లో క్ సభ లో పోరాటం చేయడానికి రా హుల్ గాంధీని మించిన నేత లేరని సీడబ్ల్యూసీ(CWC) భావించిందని చెప్పా రు. తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రజాసమస్యలు, రాజ్యాం గాన్ని రక్షించే భాధ్యతలను రాహుల్ గాంధీ సమర్థవంతంగా నిర్వహిస్తా రని సీడబ్ల్యూసీ భావిస్తున్నదని అ న్నారు. శనివారం జరిగిన సమా వేశంలో లోక్ సభ ఫలితాలు, ప్రచా రం, పథకాల హామీలపై కూలంక షంగా చర్చించామన్నారు. మా బ్యాంకు ఖాతాలను స్థంభింప జేసినా మా నేతలను బ్లాక్ మెయిల్ చేసినా ఎన్నికల్లో అద్భతమైన ప్రదర్శన చేశారని చెప్పారు.
ఈ ఎన్నికలు గతానికి పూర్తిగా భిన్నమై నవని, ప్రత్యర్థులతో పాటు మేము ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్(Exit polls results) తోనూ పోరా టం చేయాల్సి వచ్చిందన్నారు. కాం గ్రెస్, ఇండియా కూటమి ఎజెం డాను డైవర్ట్ చేసేందుకు బీజేపీ(BJP) అనే కసార్లు ప్రయత్నించిందని ఆరోపిం చారు. అయినా రాజ్యాంగాన్ని రక్షిం చుకునేందుకు ఇండియా కూటమికి అండగా నిలబడిన దేశ ప్రజలకు ధన్య వాదాలు తెలిపారు. కాంగ్రెస్ పూర్ ఫెర్మామెన్స్ చేసిన రాష్ట్రాల్లో అధిష్టానం కమిటీలను నియమించి పూర్తిస్థాయి రిపోర్ట్ కోరుతా మన్నా రు. వయనాడ్, రాయ్బరేలి రెండు చోట్ల గెలిచిన రాహుల్ గాంధీ ఏ సీటును వదులుకుంటారనే దానిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం లేదు ప్రధాని మోడీ(Prime Minister Modi) ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్టీ హాజరుకావడంపై జైరాం రమే శ్(Jairam Ramesh)స్పందించారు. మోధీ ప్రమాణో తృవానికి అంతర్జాతీయ నేతలకు మాత్రమే ఆహ్వానం అందిందని, మా నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదన్నారు. ఇండియా కూట మి నేతలకు ఆహ్వనం అందిన ప్పుడు హాజరు కావడంపై తాము ఆలోచన చేస్తామన్నారు.ఇంటా బయట సమిష్టిగా పనిచేస్తాం.. ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు లోపల, బయట సమిష్టిగా పని చేయాలని ఈ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
బీజేపీ నియంతృత్వ, ప్రజావ్యతిరేక విధా నాలకు వ్యతిరేకంగా ప్రజలు మాట్లా డారని, ఇది గత పదేళ్ల రాజకీ యాలను నిర్ణయాత్మకంగా తిరస్క రించడమేనని స్పష్టం చేశారు. విద్వే ష రాజకీయాలను ఎప్ప టికీ ఆమో దించబోరని స్పష్టం చేశారు. ఎన్ని కల ప్రచారంలో లేవనెత్తిన అంశా లపై మాట్లాడడం కొనసాగించాలని సూచించారు. ఇండియా కూటమి కొనసాగాలని ఆశిస్తున్నట్టు తెలి పారు. రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యా త్ర ఎక్కడ సాగిందో అక్కడ పార్టీ సీట్లు పెరిగాయని గుర్తు చేశారు. ఈ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, శాశ్వత ఆహ్వాని తులు దామోదర రాజన ర్సింహాతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు..
Rahul gandhi opposition leader in lok sabha