Rahul gandhi: అమేథీలోనే అన్నీ అలవర్చుకున్న
అమేథీ నుంచే తాను రాజకీయాలు అన్నీ అలవ ర్చుకున్నానని నేర్చుకున్నానని, తా ను ఇక్కడే వారితోనే ఉన్నానని, ఉంటానని భావోద్వేగంతో వ్యాఖ్యా నించారు.
ఈ ప్రాంతంతో విడదీయరాని అనుబంధం
అమేథీతోనే ఉన్నాను, ఉంటాను కూడా
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ భావోద్వేగం
ప్రజా దీవెన, అమేథీ: అమేథీ(Amethi) నుంచే తాను రాజకీయాలు అన్నీ అలవ ర్చుకున్నానని నేర్చుకున్నానని, తా ను ఇక్కడే వారితోనే ఉన్నానని, ఉంటానని భావోద్వేగంతో వ్యాఖ్యా నించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అమే థీపై తనకున్న అభిమానాన్ని మరో మారు చాటుకున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని అమేథీలో(amethi) కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్థి కేఎల్ శర్మ తరఫున శుక్రవారంనాడు ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాహుల్ తో పాటు అఖిలేష్ కూడా ప్రచారానికి హాజరయ్యారు.
ఐదో విడత పోలిం గ్ లో భాగంగా మే 20న అమేథీలో పోలింగ్(polling) జరుగనుంది. రాహుల్ తన ప్రసంగంలో 42 ఏళ్ల క్రితం తన తండ్రి రాజీవ్ గాంధీతో కలిసి అమేథీకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల గురించి తాను ఏది నేర్చుకున్నా అది ఇక్కడి నుంచే నేర్చుకున్నానని, ప్రజలే తనకు నేర్పారని చెప్పారు. తాను తొలిసారి అమేథికి వచ్చిన సమయంలో అప్పుడు రోడ్లు కానీ, అభివృద్ధి కానీ లేదన్నారు. తన తండ్రికి, అమేథీ ప్రజలకు మధ్య ఉన్న ప్రేమానుబంధానికి తానే సాక్షినని చెప్పారు. తాను కూడా ఇదే తరహా రాజకీయాలను పాటి స్తున్నానని తెలిపారు. తాను రాయబరేలి నుంచి పోటీ చేస్తున్నప్పటికీ అమేథీతో మొదట్నించీ తనకున్న అనుబంధం చెక్కుచెదరదని, ఎప్పటికీ అమేథీ ప్రజల వెన్నంటి ఉంటానని చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికలు చాలా కీలకమని రాహుల్ తెలిపారు.
ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ నేతలు రాజ్యాంగాన్ని తిరగరాస్తామని, రాజ్యాంగాన్ని బుట్టదాఖలా చేస్తామని తొలిసారి చాలా స్పష్టంగా చెబుతున్నారని పరోక్షంగా బీజేపీని(BJP) ఉద్దేశించి విమర్శించారు. రాజ్యాంగాన్ని చెరిపేద్దామా, రాజ్యాంగాన్ని తుడిచిపెట్టే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా అని ప్రజలను ఉద్దేశించి రాహుల్ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ప్రజలే పరిరక్షించుకో వాలని, రాజ్యాంగమే ప్రజావాణి, ప్రజా భవిష్యత్తు అని స్పష్టం చేశారు. ఈ దేశంలో పేద ప్రజలకు ఏది చేసినా, రైతులకు సహాయ పడినా, హరిత విప్లవం తెచ్చినా రాజ్యాంగంతోనే సాధించామని చెప్పారు. రాజ్యాంగానికి చరమగీతం పాడాలని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని, రాజ్యాం గం కనుమరుగైతే ఇక ప్రభుత్వ రంగమనేదే ఉండదని, ఉద్యోగాలు ఉండవని, ద్రవ్యోల్బణం తారాస్థా యికి చేరుకుందని, రిజర్వేషన్లకు స్వస్తి పలుకుతారని, ప్రజల హక్కులు ఒక్కొక్కటి ఊడలా క్కుంటారని రాహుల్ హెచ్చ రించారు.
కేవలం ఎంపిక చేసిన 22-25 మంది కుబేరుల కోసం రైతులు, కార్మికులు, యువత, తల్లులు, సోదరీమణుల హక్కు లను హరిస్తారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 140 సీట్లు సాధించడం కూడా కష్టమేనని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. నాలుగు విడత ల ఎన్నికలు పూర్తయ్యే సరికే బీజేపీ ఓటమిదశకు చేరుకుందన్నారు. వారి రథం మునకలేస్తోందని, 400 సీట్లు తమ లక్ష్యమని నినాదాలి చ్చినా ప్రజలు 140 సీట్లకే పరిమి తం చేయనున్నారని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను మార్చాలనుకుంటున్న వారిని ప్రజలే మార్చాలనుకుంటున్నారని అన్నారు. అమేథీలో కాంగ్రెస్ అభ్య ర్థిగా గాంధీ కుటుంబం విధేయుడు గా పేరున్న కిషోరి లాల్ శర్మ పోటీ చేస్తుండగా, బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీఎస్పీ అభ్యర్థిగా నానై సింగ్ చౌహాన్ పోటీ పడుతున్నారు.
Rahul gandhi with amethi