Modi swear: భద్రతా వలయంలో రాష్ట్రపతి భవన్
దేశంలో 10 ఏళ్లపాటు సమర్థవంతమైన పాలన సాగించిన ప్రధాని మోదీ ముచ్చ టగా మూడోసారి మోదీ 3.0 ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసేందుకు సర్వం సన్నద్ధమైంది.
నేటి మోడీ ప్రమాణ స్వీకారానికి ముస్తాబైన ఢిల్లీ
ఢిల్లీలో హై అలర్ట్ తో పాటు డ్రోన్ కెమెరాల నిషేధం
మోదీ 3.0 సర్కారు కొలువు తీరే సమయం ఆసన్నం
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో 10 ఏళ్లపాటు సమర్థవంతమైన పాలన సాగించిన ప్రధాని మోదీ(Prime Minister Modi) ముచ్చ టగా మూడోసారి మోదీ 3.0 ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసేందుకు సర్వం సన్నద్ధమైంది. కొలువు తీరే వేళ యింది. మూడోసారి ప్రధానమం త్రిగా నరేంద్రమోదీ ఆదివారం ప్రమా ణస్వీకారం చేయనున్నారు. ఈ కార్య క్రమం కోసం దేశ రాజధాని అసాధారణ రీతిలో అప్రమత్త మైంది. ప్రమాణ స్వీకార వేదిక అయిన రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)పరిస రాల్లో ప్రైవేటు డ్రోన్ల సంచారాన్ని పూర్తిగా నిషేధించారు. ఢిల్లీ ఇప్ప టికే భద్రతా వలయంలోకి వెళ్లిపో యింది. నేషనల్ సెక్యూరిటీ గార్డు లు, షార్ప్ షూటర్ బృందాలు రంగంలోకి దిగాయి.
ప్రమాణ స్వీకార మహోత్సవానికి దక్షిణా సియా దేశాల అధినేతలు వస్తుం డటం, అధికార ఎన్డీయే(NDA) పార్టీల అధినాయకులందరికీ ఆహ్వానాలు వెళ్లడంతో, ఢిల్లీలో హై అలర్ట్(High alert)ప్రక టించారు. ప్రపంచ దేశాల అధినే తలు గత ఏడాది పాల్గొన్న జీ–20 సదస్సుకు కల్పించిన భద్రతను తలపించేలా ఏర్పాట్లు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ప్రపంచాధినేతలు ఢిల్లీలో బస చేసి న హోటళ్ల దగ్గర, వారు పాల్గొనాల్సి న సదస్సు ప్రాంగణం, పరిసర ప్రాంతాలను అప్పట్లో అణువణు వున ప్రత్యక భద్రతా బృందాలు జల్లెడ పట్టాయి. చిన్న పొరపాటు కూ తావు ఇవ్వకుండా డేగకళ్ల పహారా కొనసాగించాయి.
మళ్లీ ఇప్పుడు అదే వాతావరణం దేశ రాజధానిలో కనిపిస్తోంది. ఢిల్లీ హై ఓల్టేజీ స్థితికి చేరుకుంది. ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనే ప్రము ఖులు బస చేసిన హోటళ్లు, రిసార్టు లు, ప్రభుత్వ అతిథి గృహాల వద్ద పెద్దఎత్తున భద్రతా సిబ్బందిని(Security personnel)మోహరించారు. మూడు అంచెల భద్రతా వలయాన్ని రాష్ట్రపతి భవన్ వద్ద, పరిసరాల్లో నిర్మించారు. మొదటి అంచెలో ఐదు కంపెనీల పారామిలిటరీ బలగాలు, రెండో అంచెలో నేషనల్ సెక్యూరిటీ గార్డు లు, డ్రోన్లు, ఆ తర్వాతి అంచెలో స్నీపరు బృందాలు ఉన్నాయి. రాష్ట్ర పతి భవన్ బయటి పరిసరాలు పూర్తిగా ఎన్‌ఎస్‌జీ, స్వాట్ బృం దాల అదుపులో ఉన్నాయి.
ప్రము ఖులు తాము బస చేసిన హోట ళ్లనుంచి ఏ మార్గంలో రాష్ట్రపతి భవన్‌కు వెళ్లాలి తిరిగి వారి బసకు ఎలా చేరుకోవాలనేదానిపై నిర్దిష్ట రూట్‌మ్యాప్‌ను(Routemap)తయారుచేశారు. ఈ రూట్లను స్నీపర్లు, సాయుధ బలగాలు తమ అదుపులోకి తీసు కున్నాయి. దాదాపు 2500 మంది పోలీసులను ఈ పనులకు నియ మించారు. ఢిల్లీలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల పహారా కొనసాగు తోంది. అతిథులుగా ఆహ్వానించిన ఇరుగుపొరుగు దేశాల అధినేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారి డ్జెస్, ఒబేరాయ్ తదితర ఫైవ్ స్టార్ హోటళ్లను వారికోసం బుక్ చేయడం చక చకా పూర్తి చేశారు. ఇక సాయంత్రం ఏడు గంటల తర్వాత కులువుదీరనున్న కేంద్ర ప్రభుత్వం లో ఎవరెవరు ప్రమాణం చేయబోతున్నారు వేచి చూడాల్సి ఉంది.
Rashtrapati Bhavan under security