Republic celebrations : ప్రజాదీవెన, ఢిల్లీ: 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా ఆదివారం పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆయన గురువారం రాత్రికి భారత్‌కి వచ్చారు. ఇండోనేషియా దేశాధినేత భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సుబియాంటో ముఖ్య అతిథిగా గణతంత్ర దినోత్సవ వేడులకల్లో హాజరుకానున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడి సుబియాంటోకి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మొదటి పర్యటనలో భాగంగా న్యూ ఢిల్లీకి చేరుకున్నందుకు సుబియాంటోకి హృదయపూర్వక స్వాగతం అంటూ ఎంఈవో ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ పర్యటన భారత్-ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
మొత్తం మూడు రోజుల పర్యటనతో సుబియానాటో
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లతో వరుస సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు దేశాలు రాజకీయాలు, రక్షణ, భద్రత, వాణిజ్యంతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించుకోనేందుక పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతేకాకుండా సుబియాంటో పర్యటన సందర్భంగా 3వ సీఈవో ఫోరమ్ కూడా జరగనుంది.