–తెలంగాణ నుంచి 12 మందికి పోలీస్ విశిష్ట సేవా పురస్కారాలు
Republic Day : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ : భారతదేశ 2025 గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా పోలీసు, అగ్నిమాపక, హోం గార్డు, పౌర రక్షణ సేవలకు చెందిన మొత్తం 942 మంది సిబ్బందికి గ్యాలంట్రీ అవార్డు లను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇందులో 746 మందికి పోలీస్ విశిష్ట సేవా (మెడల్ ఫర్ మెరి టోరియస్ సర్వీస్), 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 95 మందికి మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ పతకాల గ్రహీతలు ఉన్నారు.
గ్యాలంట్రీ అవార్డులలో ఎక్కువ భాగం నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో మోహరించిన సైనికులకు అందుకోనున్నారు.