Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

REVANTH REDDY: తెలంగాణకు తెగ పెట్టుబడులు

–రూ. 839 కోట్లతో కర్రా హోల్డింగ్ వీ హబ్ లో భారీ పెట్టుబడులు
–మ‌హిళ పారిశ్రామిక వేత్త‌ల‌కు వ‌ర‌దలా నిధులు
–తొలుతగా రూ.42 కోట్లతో ప్రారం భమైన పెట్టుబడులు
–రాబోయే ఐదేళ్ళలో స్టార్టప్ లలో మరో రూ.839 కోట్లతో ఒప్పందాలు
–రేవంత్ అమెరికా పర్యటనలో మరో పెద్ద కంపెనీతో అగ్రిమెంట్ లు

REVANTH REDDY:ప్రజా దీవెన, న్యూయార్క్: అగ్రరా జ్యం అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్‌ (Walsh Karra Holdings) తెలంగాణలో పెట్టు బడు లకు సంసిద్ధం వ్యక్తం చేసింది. రాబో యే ఐదేళ్లలో వీ హబ్ లో రూ.42 కోట్ల పెట్టు బడులు పెట్టేందుకు రా ష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసు కుంది. రాబోయే ఐదేళ్లలో వీ హబ్ తో పాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్లలో దాదాపు రూ.839 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్, వీ హబ్ సీఈవో (Karra, Greg Walsh, WeHub CEO) సీతా పల్ల చోళ్ల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారి శ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీ హబ్ ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ము ఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ పరి శ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ అవగాహన ఒప్పం దం కుదిరింది. ఈ సందర్భంగా వాల్ష్ కర్రా ప్రతినిధులను అభినం దించారు. ఔత్సాహిక పారిశ్రామి కవేత్తలే తెలంగాణ సామర్థ్యాన్ని చాటిచెపుతున్నారని, పారిశ్రామిక రంగంలో మహిళల అభివృద్ధి సమా జంలోని అసమానతలను తొలిగి స్తుందని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలకు సాధికారత లేకుంటే ఏ సమాజమైనా తన సామర్థాన్యి సా ధించలేదని అభిప్రాయపడ్డారు.

వాల్ష్ కర్రా హోల్డింగ్స్ కంపెనీ అమె రికా, సింగపూర్ (America, Singapore) నుంచి పని చేస్తుం ది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సహకారంతో పెట్టుబడిదారులు గ్రెగ్ వాల్ష్, ఫణి కర్రా దీన్ని నిర్వహిస్తు న్నారు. రాబోయే శతాబ్దానికి సుస్థి రమైన ఆర్థిక వ్యవస్థను రూపొందిం చేందుకు అవసరమైన పెట్టుబడి అవకాశాలను వృద్ధి చేయాలనేది కంపెనీ సంకల్పం. కొత్త ఆవిష్కరణ లు, స్థిరత్వంతో పాటు లాభదాయక మైన సంస్థలకు ఈ కంపెనీ మద్దతు ఇస్తుంది. వీటిలో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాల విస్తరణతో పాటు స్థిరమైన భవిష్యత్తు నిర్మించేందుకు సహకరిస్తుంది.వీ హబ్ తో ఒప్పం దం సందర్భంగా గ్రెగ్ వాల్ష్ మాట్లా డుతూ ఈ ఒప్పందంతో మరో అడు గు ముందుకు పడిందని అన్నారు. పెట్టుబడులతో పాటు పట్టణాలతో పాటు గ్రామీణ తెలంగాణలోనూ ప్రభుత్వంతో కలిసి వివిధ కార్యక లాపాలు చేపట్టి నమ్మకమైన భాగ స్వామ్యం పంచుకుంటామని ప్రకటించారు.ఉస్మానియా యూనివర్సి టీ (Smania University T)నుంచి కెరీర్ ప్రారంభించి అంత ర్జాతీయ స్థాయికి చేరగలిగానని, మన దేశం, రాష్ట్రం పట్ల కృతజ్ఞత ను చాటుకునే అవకాశం దొరికిం దని ఫణి అన్నారు. తమ పెట్టుబడు లు, తమ సంస్థ భాగస్వామ్యం త ప్పకుండా సానుకూల ప్రభావం చూ పుతుందనే ఆశాభావం వ్యక్తం చేశా రు. మహిళా పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడి న ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లు రూపొందిం చడానికి ఈ పెట్టుబడులు ఉపయో గపడుతాయని వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల తెలిపారు.

గ‌ద్ద‌ర్ కు ఘన నివాళి…
కవి, గాయకుడు, సామాజిక ఉద్యమకారుడు, ప్రజా యుద్ధనౌక స్వర్గీయ గద్దర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆ మహనీయుడికి నివాళుల‌ర్పించా రు. ఈ మేర‌కు అమెరికా నుంచి సీఎం రేవంత్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ‘రాజరికం కత్తి మీద నెత్తు రుల గాయమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా అంటూ పాటలతోనే పోరు బాటలు వేసిన నిఖార్సైన తెలంగాణ వాది, పొడు స్తున్న పొద్దులో వినిపించే ప్రజా వి ముక్తి గీతం గద్దరన్న అని ఒక సం దేశంలో ముఖ్యమంత్రి కొనియా డారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గద్దర్ పేరిట సాంస్కృతిక సినీ అవార్డులను నెలకొల్పిన విష యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశా రు. తెలంగాణ సాధనే ధ్యేయంగా జీవితాంతం కృషి చేసిన ప్రొఫె సర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంవ‌ త్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళి అర్పించారు. ‘ఒకరిని యాచించడం కాదు, ఇక్కడి ప్రజలే శాసించే తెలం గాణ కావాలి అన్న జయశంకర్ మాటల స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, పెద్ద సారు కోరు కున్న విధంగా తెలంగాణలో ప్రజా స్వామిక సంస్కృతిని ప్రజా ప్రభు త్వం తిరిగి నిలబెట్టిందని పేర్కొ న్నారు. ప్రజాప్రభుత్వం కొలువైన తర్వాత మొదటి కేబినెట్ సమావే శంలో తొట్టతొలి నిర్ణయంగా జయ శంకర్ స్వస్థలం అక్కంపేటను రెవె న్యూ గ్రామంగా గుర్తించిన విష యా న్ని గుర్తు చేసుకున్నారు రేవంత్.