రోడ్డు ప్రమాదంలో నలుగురు డాక్టర్ల దుర్మరణం
ప్రజాదీవెన, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలు గురు డాక్టర్లు మృతిచెందారు. వారితో పాటు ఓ ల్యాబ్ టెక్నీషియన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. సైఫాయిలో ఉన్న యూపీ మెడికల్ యూనివర్సిటీ డాక్టర్లు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
అతివేగంతో వెళ్తున్న ఎస్‌యూవీ వాహనం అదుపు తప్పి ఢివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత అటుగా వస్తున్న ఓ ట్రక్కు ఆ వాహనాన్ని ఢీకొన్నట్లు ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు. బుధవారం తెల్లవారుజా మున 3 గంటల సమయంలో ఎస్‌యూవీ వాహనం డివైడర్‌ను ఢీకొ ని మరో లేన్‌లోకి వెళ్లింది. అప్పుడు ఆ లేన్‌లో వస్తున్న మరో వాహ నం ఢీకొనడంతో నలుగురు డాక్టర్లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయా రు. ల్యాబ్ టెక్నీషియన్ కూడా స్పాట్‌లోనే చనిపోయాడు.
డాక్టర్ల ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్న ఓ పీజీ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తిర్వాలోని అంబేద్కర్ మెడికల్ కాలేజీలో అతన్ని చేర్పించారు. మృతిచెందిన వారిలో డాక్టర్ అనిరుధ్ వర్మ, డాక్ర్ సంతోష్ కుమార్ మౌర్య, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ నర్‌దేవ్ ఉన్నారు. లక్నోలో ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Road accident