–అక్కడికక్కడే నలుగురు దుర్మరణం
Road Accident:ప్రజా దీవెన, హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)రాజధాని సిమ్లాలోని జుబ్బల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం కారణంగా జుబ్బల్‌లోని గిల్తాడి రోడ్డుపై హెచ్‌ఆర్‌టీసీ బస్సు బోల్తా (HRTC bus overturned)పడగా నలుగురు అక్కడికక్కడే మృతి (died) చెందడంతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరు కుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపిం చారు. తీవ్రంగా గాయపడిన క్షతగా త్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుoడగా గాయపడిన వారి లో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రమాదం గురించి తెలు సుకున్న జుబ్బల్ తహసీల్ ఏరియా ఎస్‌డీఎం రాజీవ్ నమ్రాన్ (SDM Rajeev Namran) ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్టీసీ బస్సు జుబ్బల్ మీదుగా వెళ్తుందని రాజీవ్ వివరించారు. బస్సు ఎలా బోల్తా పడిందో తెలియడం లేదని ఆయన అన్నారు. బస్సు బోల్తా పడడంతో స్థానికులు వెంటనే బస్సు లోపల చిక్కుకున్న వారిని రక్షించి బయటకు తీసుకుని వచ్చారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే నలుగురు మృతి చెందినట్లు వైద్యులు (docters) తెలిపారు.