Road Accident : ప్రజా దీవెన, వారణాసి: ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు వెళ్తుండగా వా రణాసి దగ్గర జరిగిన రోడ్డు ప్రమా దంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలై నట్టు సమాచారం. మృతుల్లో ఇరిగేషన్ శాఖ జహీరాబాద్ సబ్ డివిజన్ డీఈ వెంకట్రామ్డ్డి (42) తోపాటు ఆ యన భార్య, డ్రైవర్ ఉండగా ఓ టీచర్‌తో పాటు మరో ఇద్దరు అతడి బంధువులున్నట్లు తెలిసింది.
సద రు అధికారి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వాహనంలో కుంభమేళాకు వెళ్తుండగా ఈ వి షాద ఘటన జరిగింది. దీంతో సం గారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగ్వార్ గ్రామంలో విషాద ఛాయ లు అలుముకున్నాయి.