Road Accident : ప్రజా దీవెన, చండీగఢ్: హర్యానా లోని ఫతేహాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెండ్లి వేడుక ము గించుకుని తిరిగి వస్తుండగా ఓ జీ పు అదుపుతప్పి కాలువలోకి దూ సుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మం ది మరణించగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. 14 మందితో కూడిన బృందం పంజాబ్‌లోని ఫజిల్కాలో జరిగిన వివాహానికి హాజరై క్రూజర్‌లో తమ స్వస్థలా లకు తిరుగుపయణమయ్యారు.
ఈ క్రమంలో ఫతేహాబాద్‌లోని భాఖడా కాలువ దాటుతుండగా అదుపుతప్పిన జీపు బ్రిడ్జిపై నుంచి నీళ్లలో పడిపోయింది. దీంతో 9 మంది మంది చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతవగా, ఇద్దరు సజీ వంగా ఉన్నారని జిల్లా సబ్‌కలెక్టర్ జగదీశ్ చంద్ర చెప్పారు.గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నా రని తెలిపారు.
మృతుల్లో ఏడాది న్నర చిన్నారితోపాటు పదేండ్ల బా లిక, ఓ మహిళ ఉన్నారని వెల్లడిం చారు. కాలువలో నీటి ప్రవాహం తక్కువైతే గాలింపు సులభమవు తుందని, దీనికోసం నీటిపారుదల శాఖ అధికారులను సంప్రదించామ న్నారు.