Saif Ali Khan : ప్రజా దీవెన, ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు కీలక మలుపు ముంబైలోని ఆయన ఇంట్లోకి చొరబడి ఆయ నపై దాడి చేసిన నిందితుడు, బంగ్లాదేశ్ జాతీయుడైన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ వేలిముద్రలు, ఘటనాస్థలి నుంచి సేకరించిన వేలిముద్రలతో సరిపోలేదు. ఈ మేరకు మహారాష్ట్ర సీఐడీని ఉటం కిస్తూ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. షరీఫుల్ రెండు చేతుల నుంచీ పది వేలిముద్రలను సేకరిం చి సీఐడీకి చెందిన ఫింగర్ ప్రింట్ బ్యూరోకు పంపగా, ఘటనా స్థలి నుంచి సేకరించిన 19 వేలిముద్రల శాంపిల్స్‌లో ఏ ఒక్కదానితోనూ సరిపోలేదు.
ఈ మేరకు నివేదికను పుణెలోని సీఐడీ సూపరింటెండెంట్‌కు నివేదించారు. చిత్రం ఏమిటంటే.. సైఫ్‌పై దాడికి సంబంధించి షరీఫుల్‌ను అదుపులోకి తీసుకునే ముందే అనుమానంతో వేర్వేరు చోట్ల ఇద్దరిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ఇద్దరికీ ఈ కేసుతో సంబంధం లేదని నిర్ధారించుకొని వదిలేశారు.