Saurabh Sharma’s : ప్రజా దీవెన మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో సంచలన సంఘటన వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ భోపాల్ లోని 2024 డిసెంబర్ 19న ఓ కార్ నుంచి 52కిలోల బంగారం, రూ. 10 కోట్ల నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం రోడ్డు రవాణా సంస్థ మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తిం చి ఇంట్లో సోదాలు చేయగా రూ. 500 నుంచి 700 కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడ్డాయి. ఏకకాలంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసి భారీ మొత్తంలో నగదు బంగారం స్వాధీ నపరచుకోవడంతో పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తు న్నారు.
ఇది ఇలా ఉండగా భారతీ య జనతా పార్టీ ప్రభుత్వంలో అవినీతికి ఇదే నిదర్శనమని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విమ ర్శిస్తోంది. అయితే 15 నెలల కమల్ నాథ్ ప్రభుత్వం అవినీతికి అక్రమాలకు ఇది మారుపేరని కమల పార్టీ నేతలు ప్రతి విమర్శ లకు దిగుతున్నారు. దీంతో మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఈ తాజా సంఘ టన రాజకీయ రంగు పులు ముకో వడం చర్చనీయాంశమైంది.