Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sensation America : అమెరికా లో సంచలనం, 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీ నామా

Sensation America : ప్రజా దీవెన అమెరికా: అమెరికా అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే ఆ దేశం సంచలనాలకు వేది కైంది. అమెరికాలో 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నపలంగా రాజీనామా చేశారు. అమెరికా అ ధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగులను తగ్గిం చనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వచ్ఛంధం గా ఉద్యోగాలకు రాజీనామా చేస్తే ఎనిమిది నెలల జీతం ముందుగానే ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం చెప్పిం ది. ఈ ఆఫర్‌కు లక్షకు పైగా ఉద్యో గులు స్పందిస్తారని భావించినా గురువారం నాటికి కేవలం 40 వేల మంది మాత్రమే రాజీనామా చేశా రు.ఈ మేరకు ఒక ఈమెయిల్‌ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదు లుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 వ తేదీలోపు ఓ నిర్ణయా నికి రావాలని అందులో వెల్లడిం చారు.దీనిని ఎంచుకొన్న వారికి సెప్టెంబర్‌ వరకు పనిచేయకుండానే జీతం పొందొచ్చని చెబుతున్నా, దా నికి ఎలాంటి హామీ లేదని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి.

సుమారు 10-15 శాతం మంది దీనిని ఎంచుకోవచ్చని ట్రంప్ కార్య వర్గం భావించింది.ఇది విజయ వంతంగా అమలైలతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలి యన్‌ డాలర్ల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. ఓ వైపు ఫెడరల్‌ నిధులు, రుణాలను నిలిపివేసిన వేళ ఈ వార్త బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. చాలా స్థానిక సంస్థల ప్రభుత్వాలు,నాన్‌ ప్రాఫిట్ సంస్థల పై దీని ప్రభావం ఉండనుందని అంచనాలు వేస్తు న్నారు అక్కడి ఆర్థిక నిపుణులు.