shower money on the wedding procession : పెళ్లి బరాత్‌లో బంధువుల హల్ చల్, రూ. 500 నోట్ల వర్షం కురిపించిన వైనం
పెళ్లి బరాత్‌లో బంధువుల హల్ చల్, రూ. 500 నోట్ల వర్షం కురిపించిన వైనం
ప్రజా దీవెన, సిద్ధార్థ నగర్: సమా జంలో పెళ్లి అంటే జీవితంలో ఒక మరపురాని ఘట్టమని(Anunforgettable event) విధితమే. పెళ్లి ఇలా చేసుకోవాలి, అలా చేసు కో వాలి ఇలా చేసుకోవాలని అని చాలా మంది కలలు కనడం కూడా పరిపాటే. అందుకోసం భారీగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉం టారు. ఇక డబ్బులు లేకపోతే అప్పు లు చేసి మరీ గ్రాండ్‌గా వెడ్డింగ్ ( grand wedding) చేసుకుంటా రు. ఇక పెళ్లిలో జరిగే ఒక్కో ఘట్టాన్ని ఒక్కో రకంగా గ్రాండ్‌గా చేసు కుంటూనే ఉంటారు. అయితే తాజాగా ఓ పెళ్లిలో బంధువులు చేసిన హడావుడి ప్రస్తుతం నెట్టింట తెగ చర్చకు దారి తీసింది.
ఎందుకంటే పెళ్లి బరాత్‌లో బంధు వులు డబ్బుల వర్షం (Relativ es shower money on the wedding procession) కురిపించి హల్ చల్ సృష్టించిన వైనం వైరల్ అయ్యింది. ఈ ఘటన కు సంబంధిం చిన వీడియోలు సోషల్ మీడియాలో (social med ia) తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ( uttar prades h) జరిగిన ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉత్త ర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఓ పెళ్లి జరిగింది. అఫ్జల్, అర్మాన్ జంట పెళ్లి చేసుకున్న తర్వాత ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.
ఇక అఫ్జల్, అర్మా న్ వివాహ బరాత్‌లో ఇరు కుటుం బాల సభ్యులు, బంధువులు, అతి థులు చేసిన హల్‌చల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ ( vairal) అవుతోంది. ఇక ఈ బరా త్ సందర్భంగా వాళ్లు డబ్బులు వెదజల్లడం (Wasting money) స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి ఊరే గింపు సందర్భంగా వరుడి బంధు వులు కొంతమంది ఇళ్లు, జేసీబీ లపైకి ఎక్కి, అక్కడికి వచ్చిన వారి పై నోట్ల వర్షం కురిపించారు. మొత్తం రూ.100, రూ.200, రూ. 500 నోట్ల ను వారిపై చల్లారు. ఇక ఇం దుకోసం మొత్తం రూ.20 లక్ష లను ఖర్చు చేసినట్లు సమాచారం.
ఇక వరుడి బంధువులు (Groom’s relatives) విసిరిన నోట్లను ద క్కించుకునేందుకు గ్రామస్థులు, పెళ్లికి హాజరైన వారు ఎగబడటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ వీడియో చూసిన నెటి జన్లు పలురకాలుగా స్పందిస్తున్నా రు.కొందరు వారికి మద్దతుగా కా మెంట్లు పెడుతుండగా మరికొందరు మాత్రం తీవ్రంగా మండి పడు తున్నారు. అలా డబ్బులను రోడ్లపై చల్లే బదులు నిరుపేదలకు అంది స్తే వారికి సహాయంగా ఉంటుంది కదా అని సూచిస్తున్నారు.
రూ.20 లక్ష లు అంటే ఆ డబ్బుతో నలుగురు పేద అమ్మాయిల పెళ్లి ళ్లు( Marriages of poor girls) జరిపించవచ్చు కదా అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇక వారికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. వాటికి పన్ను కడుతున్నారో లేదో తెలు సుకునేందుకు ఇన్ కమ్ ట్యాక్స్ అ ధికారులకు ఫిర్యాదు చేయాలని మరికొందరు కామెం ట్లు (Comments) పెడుతున్నారు. అయితే ఈ వీడియో తెగ వైర ల్ అవుతున్నా ఇ ప్పటివరకు యూపీ పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
shower money on the wedding procession