Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narendra Modi:పాక్ ఉగ్రవాదులను మట్టుపెడితే మనోళ్లు కొందరు బాధపడుతున్నా రు

పాకిస్థా న్‌లో తలదాచుకున్న ఉగ్రవాదుల ను అంతంచేస్తే ఆదేశంలో వాళ్లు బాధపడాలి కానీ, మనదేశంలో కొందరు ఆందోళనకు గురి అవు తుంటారని, ఎందుకనేది నాకు అసలు అర్థం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

పాక్‌ శక్తి ఏమిటో చూసొచ్చాను, వీసా లేకుండానే అక్కడ పర్యటిం చాను
కాంగ్రెస్ నేత మణిశంకర్‌ అయ్యర్‌ ‘పాక్‌ బాంబు’ వ్యాఖ్యలపై పరోక్షం గా మోదీ ఆగ్రహం

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: పాకిస్థా న్‌లో(Pakistan)తలదాచుకున్న ఉగ్రవాదుల ను అంతంచేస్తే ఆదేశంలో వాళ్లు బాధపడాలి కానీ, మనదేశంలో కొందరు ఆందోళనకు గురి అవు తుంటారని, ఎందుకనేది నాకు అసలు అర్థం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)వ్యాఖ్యానించారు. ముస్లిం రిజర్వేషన్లు, ఆర్టికల్‌ 370 రద్దు వంటి అంశాల్లో మార్పులేని తన వైఖరిని మరోసారి ఆయన స్పష్టం చేశారు. చివరకు ముంబై దాడులను సైతం పాకిస్థానీయు లుకాదు, భారతీయులే జరిపా రనేదాకా కొందరు వెళ్లారని, ఇంత కుమించిన సిగ్గుమాలిన ప్రకటన ఉండదంటూ ఓ కాంగ్రెస్‌ నేతపై మోదీ విరుచుకుపడ్డారు.

పాకిస్థాన్‌ శక్తి ఏపాటిదో తెలుసుకోవడానికి స్వయంగా అక్కడకు వెళ్లానని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. తాను 2015లో పాకిస్థాన్‌లో హఠాత్తుగా వీసా కూడా లేకుండా పర్యటన జరిపినట్టు తెలిపారు. దీనిపై అక్కడి విలేకరులు ప్రశ్నిం చగా ఇది ఒకానొక కాలంలో నా దేశమేనని చెప్పానన్నారు. పాకిస్థా న్‌ వద్ద అణుబాంబు ఉందనే విష యం ఆ దేశంతో వ్యవహరించేట ప్పుడు భారత్‌ గుర్తు పెట్టుకోవాలన్న కాంగ్రెస్‌ సీనియర్‌ మణిశంకర్‌ అ య్యర్‌(Mani Shankar Aiyer)వ్యాఖ్యలపై ఆయన ఇలా స్పందించారు. ఓ జాతీయ ఇంగ్లిష్‌ చానల్‌కు తాజాగా ఇచ్చిన ఇంట ర్వ్యూలోనూ పంజాబ్‌లో ఎన్నికల ప్రచార సభల్లోనూ దీనిపై మోదీ మాట్లాడారు.

కాగా ఏడో విడత ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లోని(Punjab) పటియాలా సహా పలు నియోజక వర్గాల్లో శుక్రవారం ప్రచార సభల్లో మోదీ పాల్గొన్నారు. మరోవైపు విపక్షాలను తాను శత్రువులుగా పరిగణించబోనని, ప్రతిపక్షాలతో కలిసి పనిచేయాలని తాను కోరుకుంటానని మోదీ(Modi) అన్నారు. అనుభవమున్న ప్రతిపక్ష నేతల నుంచి నిర్మాణాత్మక విమర్శలను తీసుకునేందుకు తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని తెలిపారు.

Some Indians feel Pakistan terrorist dead