Son Sood : ప్రజా దీవెన, పంజాబ్: ప్రముఖ నటుడు సోనుసూద్ కు బిగ్ షాక్ ఇచ్చింది పంజాబ్ లోని లూథియా న కోర్టు. ఈ మేరకు సోన్ సూద్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది,మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్‌పై పంజాబ్ లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
కేసు వివరాల్లోకి వెళితే.. మోహిత్ శర్మ అనే వ్యక్తి రిజికా కాయిన్ పేరుతో తనతో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని లుథియానాకు చెందిన న్యాయవా ది రాజేశ్‌ఖన్నా కోర్టులో కేసు వే శారు. ఈ కేసులో ఆయన సోనూ సూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు.
విచారణ చేపట్టిన న్యాయస్థానం సోనూ సూద్‌కు పలుమార్లు సమన్లు పంపినా ఆయన హాజరు కాలేదు. దీంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ
లుథియానా జ్యుడీషియల్ మేజి స్ట్రేట్ రమన్‌ప్రీత్ కౌర్ నాన్‌బెయి లబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశా రు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.