stock market: దూకుడుమీదున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభు త్వం ఆశించిన స్ధాయిలో ఫలితాలు సాధించలేదన్న సమాచారంతో న ష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు తిరిగి దూకుడు మీదికి వచ్చాయి.
రెండో రోజూ భారీ లాభాలతో ప్రారంభం
మార్కెట్ ఆరంభంలో సెన్సె క్స్ కు 400 పాయింట్ల లాభం
ప్రజా దీవెన, ముంబై: కేంద్రంలో బిజెపి(BJP) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభు త్వం ఆశించిన స్ధాయిలో ఫలితాలు సాధించలేదన్న సమాచారంతో న ష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు తిరిగి దూకుడు మీదికి వచ్చాయి. ఫలితాల రోజూ తగ్గుముఖం పట్టి నా ఆ తర్వాత ఎన్డీఏ(NDA) పుంజుకుం దన్న సమాచారంతో ఒక్కసారిగా లాభాల బాట పట్టాయి. సదరు లాభాలు రెండో రోజైన గురువారం
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభా లతో ప్రారంభమయ్యాయి. ఈ క్ర మంలో మార్కెట్ ఆరంభంలో సెన్సె క్స్ 400 పాయింట్ల లాభంతో ప్రారం భమైంది. కాగా నిఫ్టీ 100 పాయిం ట్లకు పైగా వృద్ధిని నమోదు చేసింది. ఈ క్రమంలో ఉదయం 10.12 గంట ల నాటికి సెన్సెక్స్ 512 పాయింట్లు లాభపడి 74,892 పరిధిలో ట్రేడవ గా, నిఫ్టీ 158 పాయింట్లు వృద్ధి చెం ది 22,774 స్థాయి వద్ద ఉంది. మరో వైపు బ్యాంక్ నిఫ్టీ 205 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ ఏకం గా 1231 పాయింట్లు లాభప డింది.
ఇక రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ(Nifty Realty)2.98 శాతం లాభాల తో ముందుండగా, పీఎస్‌యూ బ్యాంక్ (2.62 శాతం), మీడియా (2.02 శాతం) లాభపడ్డాయి. ఇది కాకుండా ONGC, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, BPCLలో లాభాలు నమోదయ్యా యి. హెచ్‌యూఎల్, బ్రిటానియా(Britannia)షేర్లు నష్టాలను చవిచూశాయి.మరోవైపు అంతర్జాతీయ సూచీలైన డౌ ఫ్యూచర్స్ ఫ్లాట్‌గా ఉన్నాయి. నిక్కీ 450 పాయింట్లు బలపడింది. అదే సమయంలో బుధవారం అమె రికన్ మార్కెట్లలో బలమైన పెరు గుదల కనిపించింది. టెక్ స్టాక్స్‌లో(Tech stocks)బలమైన పెరుగుదల కారణంగా నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500 జీవిత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. నాస్ డాక్ 330 పాయింట్లు ఎగబాకగా, డౌ జోన్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి గరిష్ట స్థాయి వద్ద ముగిసిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
Stock market started with profits