Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Supreme Court : ఉచితాలతో పరాన్నజీవుల ఉత్పాదన

–ఉచిత రేషన్, ఉచిత నగదుతో పెరుగుతోన్న సోమరితనం

–రాజకీయపార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టు అసహనం

Supreme Court : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో ఉచితాల ఉదరగొట్టుతనం రోజు రోజుకు సోమరితనాన్ని పెంచి పోషి స్తోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దేశం, రాష్ట్రాల స్థాయిల్లో రాజకీయ పార్టీలు ఉదగొ డుతోన్న ఉచితాలు పరాన్నజీవుల ఉత్పాదక సంస్థలుగా తయార య్యాయని తీవ్రంగా స్పందించింది. ఎన్నికల ముందు ఉచిత పథకాల ప్రకటన విధానాన్ని సుప్రీంకోర్టు బు ధవారం నర్మగర్భంగా ఆక్షేపించింది. ఎన్నికల ముందు రాజకీయ పార్టీ లు ‘ఉచితాలను’ వాగ్దానం చేస్తుం డడాన్ని సు ప్రీంకోర్టు ప్రస్తావిస్తూ, ప్రజలను జాతీయ అభివృద్ధి కోసం ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడా నికి బదులు ‘మనం పరాన్నజీవుల తరగతిని సృష్టించడం లేదా’ అని సూటిగా ప్రశ్నించింది. ప్రజలను స మాజంలోని ప్రధాన స్రవంతిలో భా గం చేసి, జాతీయ అభివృద్ధికి దో హదం చేసేలా చూడడం శ్రేయ స్కరమని సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు బిఆర్ గవాయ్, అగస్టీన్ జార్జి మాసీహ్ తో కూడిన ధర్మాస నం స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘దురదృష్టవశాత్తు, ఎన్ని కల ప్రకటనకు సరిగ్గా ముందు ‘లడ్కీ బహిన్’, వంటి ఉచిత వరాల కారణంగా జనం పని చేయడానికి ఇష్టపడడం లేదని జస్టిస్ గవాయ్ చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్ర యులకు గూడు కల్పన హక్కు సం బంధిత పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తున్నది. ఉచి త రేషన్, నగదు అందుతు న్నందు న పని చేయడానికి జనం సుము ఖంగా లేరని కోర్టు వ్యాఖ్యానించిం ది. పేదల మీ ఆందోళనను మేము గుర్తి స్తున్నాం. అయితే, వారిని స మాజంలో ప్రధాన స్రవంతిలో భా గం చేసి, దేశ అభివృద్ధికి పాటు పడేందుకు వారిని అనుమ తించ డం మెరుగు అవుతుంది కదా’ అని బెంచ్ పేర్కొన్నది. పిటిషనర్లలో ఒక రి తరఫున హాజరవుతున్న న్యా యవాది ప్రశాంత్ భూషణ్ ప్రజలకు చేసేందుకు పని ఉన్నట్లయితే, పని చేయడానికి ఇష్టపడనివారు దేశం లో ఎవరూ లేరని అన్నారు. ‘మీకు ఒక వైపు సమాచారం ఉన్నట్లుంది. నేను వ్యవసాయ కుటుంబం నుం చి వచ్చాను. మహారాష్ట్రలో సరిగ్గా ఎన్నికల ముందు ప్రకటించిన ఉచి తాల కారణంగా వ్యవసా యదారు లకు కూలీలు లభించడంలేదు’ అ ని న్యాయమూర్తి చెప్పారు. అయి తే, తాము చర్చను కోరుకోవడం లేదని కోర్టు స్పష్టం చేసింది. నిరా శ్రయులకు ఒక ఆశ్రయం కల్పించ డంపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని అటార్నీ జనరల్ ఆర్ వెంక టరమణి సహా ప్రతి ఒక్కరూ భావి స్తున్నారని కోర్టు తెలిపింది. ‘అయి తే, అదే సమయంలో అది సమ తూకంగా ఉండరాదా’ అని బెంచ్ అడిగింది. పేదరిక నిర్మూలన పథ కం ఖరారు ప్రక్రియలో కేంద్రం ఉన్న దని, అది పట్టణ ప్రాంత నిరా శ్ర యులకు గూడు కల్పించడంతో సహా వివిధ సమస్యలను పరిష్క రించగలదని వెంకటరమణి బెంచ్ తో చెప్పారు.

పట్టణ పేదరిక నిర్మూ లన పథకం ఎప్పటి నుంచి వర్తిస్తుం దో కేంద్రం నుంచి ధ్రువీకరణ పొంద వలసిందని, అది వర్తించే అన్ని అం శాలను రికార్డుగా తమ ముందు ఉంచాలని అటార్నీ జనరల్ ను బెంచ్ కోరింది. ‘ఈలోగా సదరు పథకం అమలు లోకి వచ్చేంత వర కు జాతీయ పట్టణ ప్రాంత జీవనో పాధి మిషన్ ను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని ఉత్తర్వులను తీసుకోవలసిందిగా అటార్నీ జన రల్ ను కోరుతున్నామని బెంచ్ తెలియజేసింది. అఖిల భారత ప్రా తిపదికపై పరిగణన నిమిత్తం అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం సేక రించవలసిందిగా కూడా కేంద్రాన్ని బెంచ్ కోరింది. నిరాశ్రయుల సమ స్యను పరిష్కరించక పోవడం దుర దృష్టకరమని, దానికి ప్రాథమ్యాల్లో చివరి స్థానం ఇస్తున్నారని విచా రణ సమయంలో ఒక పిటీష నర్ ఆరోపించారు. అధికారులు పేదల పై కాకుండా సంపన్నులపై అభిమా నం చూపుతున్నారని ఆయన వ్యా ఖ్యానించిన ప్పుడు బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ కోర్టుల రామ్జీ లా మైదాన్ ఉపన్యాసం ఇవ్వకండి’ అని జస్టిస్ గవాయ్ అన్నారు. ‘అన వసర ఆరోపణలు చేయకండి. ఇక్కడ రాజకీయ ప్రసంగం చేయ కండి. మా కోర్టు గదులను రాజకీ య సమరం (ప్రదేశం)గా’ మారని వ్వం’ అని ఆయన చెప్పారు. ‘సంప న్నుల పట్ల మాత్రమే అభిమానం చూపుతున్నారని మీరు ఎలా అం టారు? తుదకు ప్రభుత్వానికి సం బంధించినంత వరకైనా మీరు ఇలా ఎలా అంటారని న్యాయమూర్తి అడిగారు. ప్రభుత్వం పేదల కోసం ఏమీ చేయలేదని గాని వారి పట్ల ఆందోళన వ్యక్తం చేయలే దని గాని అనడం సముచితం కాదని కోర్టు వ్యాఖ్యానించింది.గతేడాది డిసెం బర్ 4న బెంచ్ కు సమర్పించిన ఒక పత్రం ప్రకారం, రాష్ట్రాలు లేదా కేం ద్రపాలిత ప్రాంతాలు మొత్తం 2557 ఆశ్రయాలు మంజూరు చేశాయని 1.16 లక్షల పడకలతో 1995 ఆశ్ర యాలు పని చేస్తున్నాయని భూష ణ్ కోర్టుకు తెలియజేశారు. సర్వోన్న త న్యాయ స్థానం ఆరు వారాల త రువాత ఈ కేసు విచారిస్తామని ప్రకటించింది.