Kejriwals plea: కేజ్రీవాల్ కు చుక్కెదురు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయి ల్ను పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరిం చింది.
బెయిల్ వారం రోజులు పొడిగింపు కోరిన ఢిల్లీ సీఎం
విచారణ లేకుండానే పిటిషన్ దశ లోనే తిరస్కరించిన సుప్రీంకోర్టు
ముందనుకున్నట్లు నిర్దేశించిన సమయానికే లొంగిబాటుకు ఆదేశం
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు(Arvind Kejriwal)సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయి ల్ను పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరిం చింది. అసలు కేజ్రీవాల్ దరఖాస్తు ను స్వీకరించేందుకు కోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ కేజ్రీవాల్‌కు ఇచ్చింది. కేజ్రీవాల్ దర ఖాస్తు విచారణకు అర్హమైనది కాద ని పేర్కొంది. దీంతో సీఎం కేజ్రీవాల్ జూన్ 2వ తేదీన లొంగిపోవాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా ఎన్ని కల(Election) నేపథ్యంలో మే 10న జస్టిస్ సంజీవ్ ఖన్నా,(Justice Sanjeev Khanna) జస్టిస్ దీపాంకర్ దత్తా కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయి ల్ మంజూరు చేశారు. జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోవాలని కోరారు. అయితే అకస్మాత్తుగా ఆరేడు కిలోల బరువు తగ్గినందున అనేక వైద్య పరీక్షలు చేయించుకో వడానికి మధ్యంతర బెయిల్(Bail)వ్యవ ధిని ఏడు రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టును(Supreme Court)ఆయన అభ్యర్థించా రు. దీనిని సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది.
Supreme court refuses kejriwal petition