Supreme Court : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: తెలంగాణ స్థానికత కలిగి గతంలో తెలంగాణ రాష్ట్రం బయట ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇన్ సర్వీస్ వైద్యులకు పీజీ వైద్య విద్య అడ్మిషన్లలో అవకాశం కల్పించాల్సిందిగా బుధవారం సు ప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ప్రధానంగా ఇన్ సర్వీస్ వైద్యుల తరఫున అడ్వకేట్ శ్రీరామ్ సుప్రీంకోర్టులో వాద నలు వినిపిస్తూ తెలంగాణ స్థానిక కలిగి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేవలం ఎంబీబీఎస్ చదువు మాత్ర మే తెలంగాణ బయట పూర్తి చేసి తిరిగి సొంత రాష్ట్రంలో సుదీర్ఘకా లం కాంట్రాక్ట్ వైద్యులుగా సేవలంది స్తూ తెలంగాణ స్థానికత ఆధారం గా రెగ్యులర్ ప్రభుత్వ సర్వీసులో చేరి సుమారు 6 నుంచి 10 సంవ త్సరాల కాలం పాటు తెలంగాణ ప్రజలకు సేవలు అందిస్తున్నారు కావున వారికి ఇన్ సర్వీస్ లో పీజీ చేసే అర్హత వారికి ఉందని వాద నలు వినిపించారు.
వాదనల అనం తరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇన్ సర్వీస్ వైద్యుల అభ్యర్థనకు అనుకూలంగా మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తు న్న న్యాయవాదులు శంకర్ నారా యణ అలాగే శ్రవణ్ కుమార్ కర ణం లకు వెంటనే అభ్యర్థులకు పీజీ అడ్మిషన్లలో అవకాశం కల్పించాల ని సూచనలు చేసారు. అందుకు ప్రభుత్వ తరఫున లాయర్లు కూడా సుముఖత వ్యక్తం చేసి తెలంగాణ ఇన్ సర్వీస్ వైద్యులకు పీజీ అడ్మి షన్లలో అవకాశం కల్పిస్తామని సు ప్రీంకోర్టు న్యాయమూర్తి ముందు ఒప్పుకున్నారు. ఎట్టకేలకు సుప్రీం కోర్టులో న్యాయం జరిగినందుకు ఇన్ సర్వీస్ అభ్యర్థులు హర్షం వ్య క్తం చేస్తూ తెలంగాణ ఇన్ సర్వీస్ అభ్యర్థుల తరపున సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వాని కి మరీ ముఖ్యంగా అభ్యర్థుల తర ఫున ప్రత్యేక చొరవ తీసుకున్న ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ కి ధన్యవాదాలు తెలియజేసారు.