Suvidha App: ‘సువిధ’తో సులభం
ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్నివిస్తృతంగా వినియోగిస్తోంది. గతంలో ఎన్నికల ప్రచారానికి అనుమతులు తీసుకోవాలంటే అభ్య ర్థులు ఎన్నో ఇబ్బందులు పడేవారు.
అభ్యర్థుల ప్రచారాలకు అనుమతి తప్ప నిసరి
సువిధ యాప్ ద్వారా 48 గంటల్లోనే గ్రీన్ సిగ్నల్
కేంద్ర ఎన్నికల సంఘం సంస్కరణలు
ప్రజా దీవెన నల్లగొండ బ్యూరో: ఎన్నికల సంఘం(Election Commission Technology) సాంకేతిక పరిజ్ఞానాన్నివిస్తృతంగా వినియోగిస్తోంది. గతంలో ఎన్నికల ప్రచారానికి అనుమతులు తీసుకోవాలంటే అభ్య ర్థులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. కాగితాల పై దరఖాస్తు రాసుకొని కార్యాలయాల చుట్టూ తిర గాల్సి వచ్చేది. సాంకేతిక యుగం నడుస్తున్న ఈ నేటి కాలంలో అరచేతిలోనే అన్ని అనుమతులు సులభ తరం అవుతున్నాయి. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా సువిధ యాప్( Suvidha app)ను ప్రవేశ పెట్టింది. అనుమతుల జారీకి అధికారుల వద్దకు వేల్ల వెళ్లాల్సిన పనిలేదు. యాప్లో దరఖాస్తు చేస్తే సులభతరంగా అనుమతులు జారీ చేస్తుంది.
యాప్ లోనే దరఖాస్తులు…
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్(Nomination) పత్రాల స్వీకరణ కార్యక్రమం పూర్తయింది. అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం మరింత జోరుగా నిర్వహించనున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి ఓటర్లను తమవైపు తిప్పుకొ నేందుకు కృషి చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతమైన వాతావరణలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు చేపట్టింది. అభ్యర్థులు నిర్వహించే ప్రచా రాలకు సంబంధించి నిబంధనలు విధించింది. నేతలు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిం చాలన్నా ముందస్తుగా ఎన్నికల సంఘం అధి కారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సువిధ యాప్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఇలా చేయాలి….
సెల్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా సువిధ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
సమావేశం నిర్వహించే వివరాలతో పాటు తమకు ఏవిధమైన అనుమతులు కావాలో అందులో నమోదు చేయాలి.
అనుమతికి సంబంధించి మీ సేవా కేంద్రం(Mee Seva center)లో చలానా చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన చలానా రసీదు, సువిధ యాప్లో నమోదు చేసిన వివరాలను రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ పరి ధిలోని ఏఆర్ కార్యాలయాల్లో అందజేయాలి.
ఎలాంటి జాప్యం లేకుండా దరఖాస్తులు ఎన్ని కల అధికారులకు చేరిన 48 గంటల్లోనే అను మతులు జారీ చేస్తారు.
అనుమతి జారీలో జాప్యం జరిగితే సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు అనుమతులతో పాటు తమ నామినేషన్లను సైతం వేసే వెసులుబాటు కల్పించారు.
ఏ కార్యక్రమం చేపట్టినా..
ఎన్నికల నేపథ్యంలో ఏ కార్యక్రమం నిర్వహించా లన్నా అనుమతి తప్పనిసరి. ఒక పార్టీకి చెందిన ప్రచార వాహనం లోక్ సభ(Lok sabha) పరిధిలోని అన్ని నియో జకవర్గాల్లో తిరగాల్సి వస్తే ఇందుకు గాను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్ అనుమతి ఇస్తారు. సభలు, సమావేశాలకు ప్రధాన నాయకులు హెలికాప్టర్లో రావాల్సి ఉంటే దీనికి కూడా కలెక్టర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా సువిధ ద్వారానే దరఖాస్తు చేసుకుంటే అనుమతి జారీ చేస్తారు.
అసెంబ్లీ పరిధిలో..
లోక్ సభ పరిధిలోని(Lok sabha elections) అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారానికి ఏఆర్ఓలు(ARO) అనుమతులు జారీ చేస్తారు. నియోజకవర్గ పరిధిలో వాహనాలు, ప్రజలతో కలిసి ర్యాలీలు, సభలు, సమావేశాలు, తాత్కాలిక ఎన్నికల కార్యాలయాల ఏర్పాటు, లౌడ్ స్పీకర్లు, జెండాలు, పోస్టర్ల వినియోగం, ఇంటింటి ప్రచా రాలు ఇలా ఏదైనా విధిగా అభ్యర్థులు అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
Suvidha app for parliament election candidate